Waltheru veerayaya trailer : అన్నీ మంచి శకునములే అన్నట్లు… అన్ని విధాలుగా వాల్తేరు వీరయ్య కేక అన్పిస్తుంది. దేవిశ్రీ సాంగ్స్ ఫ్యాన్స్ ని ఊపేస్తున్నాయి. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ పాత రికార్డులను ఊచకోత కోస్తుంది. యూట్యూబ్ లో టాప్ వన్ లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్ విశేష ఆదరణతో దూసుకుపోతుంది. కాగా వాల్తేరు వీరయ్య ట్రైలర్ 24 గంటల్లో 11.77 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ట్రైలర్ కి వస్తున్న స్పందన చూస్తుంటే వాల్తేరు వీరయ్య ఓపెనింగ్స్ లో నయా టాలీవుడ్ రికార్డు సెట్ చేస్తుందనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య మూవీ కోసం అభిమానులు, మూవీ లవర్స్ పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం.

దర్శకుడు బాబీ ఇద్దరు మాస్ హీరోలను వారి ఇమేజ్ కి తగ్గట్లు చక్కగా కథలో బ్లెండ్ చేసి మూవీ తెరకెక్కించారని అర్థం అవుతుంది. గ్యాంగ్ స్టర్ చిరంజీవి, ఏసీపీ రవితేజ లకు వైజాగ్ వేదికగా జరిగే ఆధిపత్య పోరు అద్భుతం చేస్తుందనిపిస్తుంది. ట్రైలర్ లో ఈ విషయం చెప్పేశారు. వీరయ్య, విక్రమ్ సాగర్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య ప్రోమోలకు వస్తున్న రెస్పాన్స్ మూవీ విజయంపై మరింత నమ్మకం పెంచేశాయి.
యాక్షన్, మాస్ మేనరిజమ్స్ సినిమాలో హైలెట్ కానున్నాయి. ఇక శృతి గ్లామర్, సాంగ్స్ లో చిరుతో ఆమె కెమిస్ట్రీ అలరించే సూచనలు కలవు. కాగా నేడు వైజాగ్ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. రవితేజ-చిరంజీవి స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ చేరుకున్నారు. అయితే హీరోయిన్ శృతి హాసన్ రాకపోవడం నిరాశపరిచే అంశం. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని శృతి హాసన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
చిరంజీవి గారితో పనిచేయడం గొప్ప అనుభూతి అన్న శృతి… వాల్తేరు వీరయ్య టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. శృతి ఈ చిత్రంతో చిరుతో జతకడుతున్నారు. రవితేజకు జంటగా కేథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. ఆమెను ఇంత వరకు రివీల్ చేయలేదు. ఆమెది కథలో కీలక రోల్ కావడం వలన చూపించడం లేదా లేక ప్రాధాన్యత లేని పాత్రనా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య తెరకెక్కించారు. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. హిందీలో సైతం వాల్తేరు వీరయ్య విడుదల కావడం విశేషం.