Balakrishna: చాలామంది దర్శకులు తమ ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో వాళ్ళకి ఒక మూవీ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. దాని కోసం పడిన కష్టం కావచ్చు, ఆ సినిమాలో హీరోని చూపించిన విధానం అయ్యుండొచ్చు. ఏది ఏమైనా కూడా ఆయా దర్శకులకు ఇష్టమైన సినిమాలైతే కొన్ని ఉంటాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వివి వినాయక్ సైతం తన కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేశాడు. ఆయన బాలయ్య బాబుని హీరోగా పెట్టి చేసిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి తను ఎక్కడ డీలాపడకుండా ఆ తర్వాత వరుస సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెన్నకేశవరెడ్డి సినిమా కమర్షియల్ గా సక్సెస్ ని సాధించకపోయిన కూడా ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని ఆయన చెప్పడం విశేషం…ఆ సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ సైతం ఎక్కువగానే ఉంటాయట.
ప్రతి ఫ్రేమ్ కూడా ఆయన చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాడు. అయినా కూడా సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు నిరాశ చెందారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వినాయక్ మరోసారి మెగా ఫోన్ పట్టి తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ లో చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి వినాయక్ కి ఆ తర్వాత ఆశించిన మేరకు గుర్తింపు రాలేదు.
ఇక బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ను పెట్టి ఛత్రపతి సినిమా రీమేక్ చేసిన కూడా ఆయన అనుకున్న సక్సెస్ నైతే సాధించలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు మరోసారి మరో సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయన జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం విశేషం…
