
తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో వివి. వినాయక్ కూడ ఒకరు. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈయన పలు ఇండస్ట్రీ హిట్లను అందించారు. ‘ఆది, ఠాగూర్, చెన్నకేశవ రెడ్డి, ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే గత నాలుగైదేళ్లుగా ఆయనకు ‘ఖైదీ నెం 150’ మినహా వేరే పెద్ద విజయమేదీ లేదు. అలా దెలాగా సాగుతున్న ఆయన ఉన్నట్టుండి హీరో అవ్వాలనే నిర్ణయం తీసుకుని అందరికీ షాకిచ్చారు. ఈ అయితే ఇది వినాయక్ సొంత డెసిషన్ కాదు. దానివెనుక చాలా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
దిల్ రాజు ఎప్పుడూ కథలూ వింటూనే ఉంటారు. వీలైతే తాను చేయడం లేకపోతే వేరే నిర్మాతలకు ఎడ్జెస్ట్ చేయడం, ఏయే కథలకు ఏయే నటీనటులు సరిపోతారో దర్శకులకు సలహా ఇవ్వడం చేస్తుంటారట. అలా తన వద్దకు వచ్చిన ఒక కథకు వినాయక్ హీరోగా అయితే బాగుంటారని నమ్మిన దిల్ రాజు వెంటనే వినాయక్ వద్దకు ప్రపోజల్ పంపారు. వినాయక్ సైతం కథ విని ఇదేదో బాగనే ఉంది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు హీరోగా చేయడానికి ఒప్పుకున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డు బద్దలు
అలా ఈ ఏడాది జనవరిలో వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమా లాంచ్ అయింది. ఎన్. నరసింహ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో వినాయక్ చేస్తున్నది మెకానిక్ పాత్ర. ఈ చిత్రం కోసం వినాయక్ వర్కవుట్స్, కఠినమైన డైట్ చేసి బాగా బరువు తగ్గారు. స్మార్టుగా తయారయ్యారు. ఆయన లుక్ చూసి ప్రేక్షకులు కూడ ఇంప్రెస్ అయ్యారు. కొంతభాగం షూటింగ్ కూడ జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పటివరకు షూట్ రీస్టార్ట్ కాలేదు. నిర్మాత దిల్ రాజు నుండి ఎలాంటి అప్డేట్ లేదు.
Also Read: మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యానంటున్న హీరోయిన్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వినాయక్ ఈ సినిమా ప్రస్తావన రాగానే సరదాగా నవ్వుతూ ఆ సినిమా వలన నేను బాగా బరువు తగ్గి స్లిమ్ అయ్యాను. ఆ చిత్రం ఒప్పుకోవడం మూలాన నాకు జరిగిన బెన్ఫిట్ అదొక్కటే అన్నారు. దీన్నిబట్టి ఆ చిత్రం ఆగిపోయిందని, ఇకపై మొదలయ్యే అవకాశం లేదని తేలిపోయింది.