https://oktelugu.com/

మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యానంటున్న హీరోయిన్

రంగురంగుల సినీ ప్రపంచంలో బయటి జనాలకు కనిపంచేది పేరు, డబ్బు, హోదా మాత్రమే. కానీ ఆ రంగుల వెనుక ఎన్నో కుట్రలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు దాగుంటాయి. అవి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ముఖ్యంగా ఈ కష్టాలు నటీమణుల జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి తీవ్రమైన సమస్యల బారినపడిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కొంతమంది బయటికొచ్చి తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ కష్టాలను బయటకు చెప్పుకుంటూ […]

Written By:
  • admin
  • , Updated On : October 31, 2020 / 05:25 PM IST
    Follow us on


    రంగురంగుల సినీ ప్రపంచంలో బయటి జనాలకు కనిపంచేది పేరు, డబ్బు, హోదా మాత్రమే. కానీ ఆ రంగుల వెనుక ఎన్నో కుట్రలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు దాగుంటాయి. అవి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ముఖ్యంగా ఈ కష్టాలు నటీమణుల జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి తీవ్రమైన సమస్యల బారినపడిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కొంతమంది బయటికొచ్చి తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ కష్టాలను బయటకు చెప్పుకుంటూ వస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

    తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ ఇండస్ట్రీలో నెలకొన్న కాస్టింగ్ కౌచ్ గురించి తన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఫాతిమా సనా షేక్ చిన్ననాటి నుండి సినిమాల్లో నటిస్తోంది. 1997లో కమల్ హాసన్ కుమార్తెగా ఒక సినిమాలో కనబడింది. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్ అయింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాలో హీరో పెద్ద కుమార్తె పాత్రలో నటించి అందరి మన్ననలూ పొందింది. ఈ సినిమాతో ఆమె స్టార్ తిరిగింది. వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అవకాశాల వెనకే ఇబ్బందులూ ఆమె తలుపు తట్టాయి. ఇబ్బందులంటే మామూలు ఇబ్బందులు కావు కాస్టింగ్ కౌచ్ కష్టాలు.

    Also Read: కాజల్ కు పెళ్లి అయింది కానీ హనీమూన్ లేదట?

    ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే లైంగిక సుఖం ఇస్తేనే దొరుకుతుందని చాలా మంది తనతో చెప్పారన్న ఫాతిమా అలాంటి చిక్కులు తనకు కూడ వచ్చాయని, వాటి మూలానే చాలా చోట్ల పనిని కోల్పోయానని చెప్పుకొచ్చింది. కేవలం సినిమాల్లోనే కాదు ఆడపిల్ల జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిందే అంటూ తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యాను అంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. వేధింపులను బయటకు చెప్పడానికి చాలామంది సంకోచిస్తారు కానీ ఇప్పుడు ప్రపంచం మారుతోంది అంటూ ఆడపిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.