Vrusshabha Teaser Review: సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటై పోయింది. పాన్ ఇండియాలో ఏ సినిమా వచ్చిన కూడా ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూసి ఆదరిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఈ క్రమంలోనే చాలా సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ లను సాధిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ‘వృషభ’ అనే సినిమాని చేస్తున్నాడు. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నుంచి గత కొద్దిపాటి క్రితమే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఒక ఈ టీజర్ లో ఆ కోటలను అలాగే రాజ్యాన్ని బాహుబలి రేంజ్ లో క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక మోహన్ లాల్ పాత్రను చాలా వైల్డ్ గా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన ఒక వారియర్ గా తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు…ఇక టీజర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…
మరి ఇలాంటి క్రమంలోనే మోహన్ లాల్ డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఇప్పటికే తుడురం అనే చిన్న సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఒక్కసారిగా భారీ బడ్జెట్ తో సినిమాని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే వస్తోంది. ప్రస్తుతం ఆయన ఏజ్ హీరోలందరు కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే మోహన్ లాల్ కి ఈ సినిమా ఎంతవరకు బ్రేక్ ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమాలో విజువల్స్ చాలా బాగున్నప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆ విజువల్స్ సినిమాకు మైనస్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని ఎంతలా చక్కగా డీల్ చేయగలుగుతారు అనే దాని మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలం లో వస్తున్న సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్ బాగుంటే ఆ సినిమాకి ఈజీగా సక్సెస్ టాక్ అయితే వస్తోంది…