Anurag Kashyap: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ గొప్ప సినిమాలను తీశారు. ఇక అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ లాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి ఆయన మంచి రచయిత, అంతకు మించిన దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరమీద చూపించి ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించగలిగేంత కెపాసిటి ఉన్న దర్శకుడు కావడం విశేషం… అందువల్లే ఆయన సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. కల్టు సినిమాలుగా అతని సినిమాలను గుర్తిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల అతనికి చాలా మంచి గ్రిప్ అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ‘నిశాచి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ సినిమాలో హీరో డ్యూయల్ రోల్ పోషించాడని ఇద్దరు కవలలు ఒకరు మంచి దారిలో వెళితే, మరొకటి చెడు దారిలో వెళ్తారు. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి. కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఒక ఇంట్రెస్టింగ్ తో ఈ సినిమా ఉంటుందని, చాలా కష్టపడి ఈ సినిమాను చేశానని అనురాగ్ కశ్యప్ చెప్పాడు. ఇక దాంతోపాటుగా ఐశ్వరీ ఠాక్రే అనే కొత్త నటుడితో ఈ సినిమాలో నటింపజేశానని చెప్పాడు. ఇక హీరోగా తన పాత్రను తను అద్భుతంగా చేశాడని చెప్పాడు.
Also Read: టీవీ5 సాంబ సార్ క్రికెట్ పాఠాలు.. నేర్చుకోండయ్యా?
అయితే మొదట్లో హీరోకి తను ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాల్సి ఉంటుందనీ విషయం తెలియదని తను నిదానంగా అతనికి అరెండు క్యారెక్టర్స్ ను ఎక్కించానని అతని చేత ఆ క్యారెక్టర్ని చేయించానని చెప్పాడు… ఇక ఇందులో హీరోయిన్ గా ‘వేదిక పింటో’ చేస్తున్నారు.
ఆమె మాధురి దీక్షిత్ లా ఉంటారు. నిజానికి ఆయన స్టార్స్ తో సినిమాలు చేయనని చెప్పాడు. ఎందుకంటే వాళ్లతో సినిమాలు చేస్తే కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేయాల్సి ఉంటుంది. అందుకే గుర్తింపు లేని నటులతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాను. అలా అయితే మనకు నచ్చినట్టుగా మన సినిమాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అలా చేస్తానని చెప్పాడు…
ఇక ఫైనల్ గా తను బాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడానికి కారణం బాలీవుడ్ భావిస్తుందని తను ఏం మాట్లాడినా దాన్ని తప్పుగా వక్రీకరించి చెబుతున్నారని అందువల్లే ముంబైలో ఉండడం మానేసి బెంగళూరుకి వచ్చేసానని ముంబైలో ఒక రెండు సంవత్సరాల్లో ఎన్ని కథలైతే రాస్తానో ఇక్కడ 8 నెలలు అంతకు మించిన కథలను రాశానని చెప్పాడు. ఇక బెంగుళూరు లో ఉండటం వల్ల తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం బెంగళూరులోనే చాలా ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పడం విశేషం…