https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఉత్కంఠగా మారిన ఓటింగ్ ప్రాసెస్.. రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆ కంటెస్టెంట్ ఎవరు?

శోభా ఓటమిని తీసుకోలేదు, అమర్ ఫ్రెండ్స్ చెప్పిన మంచిని అర్థం చేసుకోలేక పోతున్నాడు అని నాగార్జున అడిగారు. మెజారిటీ హౌస్ మేట్స్ ఎస్ చెప్పారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 15, 2023 / 06:10 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆరో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు ఆదివారం కావడంతో సండే ఫన్ డే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున హౌస్ మేట్స్ కి గేమ్ పెట్టారు . అందులో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. హౌస్ మేట్స్ అవునా ,కాదా అని చెప్పాలి. మెజారిటీ చెప్పిన సమాధానాన్ని బట్టి ఆ ప్రశ్న ఎవరి గురించి అడిగారో ఆ కంటెస్టెంట్ ఒక కరేలా షాట్ తాగాలి అని చెప్పారు.

    ముందుగా తేజా కేవలం కామిడీ వేసుకుని మాత్రమే ముందుకెళ్తున్నాడు అని నాగార్జున ప్రశ్న వేశాడు. మెజారిటీ హౌస్ మేట్స్ నో అని చెప్పారు.’ నీ టైం బాగుందయ్యా’ అని నాగార్జున అన్నారు. అశ్విని కి బిగ్ బాస్ అర్థం కావడం లేదు అని అడిగాడు నాగ్. తేజా ఒక్కడు తప్ప హౌస్ మేట్స్ అందరూ ఎస్ అని చెప్పారు. అందరిని చూసి బోర్డు మార్చేశాడు తేజ. నువ్వు సేఫ్ గేమ్ బాగా ఆడుతున్నావ్ ,ఒక్కడివే నో చెప్పినందుకు షాట్ తాగాలి అని పనిష్మెంట్ ఇచ్చారు నాగార్జున.

    శోభా ఓటమిని తీసుకోలేదు, అమర్ ఫ్రెండ్స్ చెప్పిన మంచిని అర్థం చేసుకోలేక పోతున్నాడు అని నాగార్జున అడిగారు. మెజారిటీ హౌస్ మేట్స్ ఎస్ చెప్పారు.ఒకరి తర్వాత ఒకరు షాట్స్ తాగి పనిష్మెంట్ తీసుకున్నారు.ఇదంతా చాలా సరదాగా సాగింది.

    దీనిని పక్కన పెడితే, శనివారం ఎపిసోడ్ లో రతిక,దామిని, శుభ శ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరికి మాత్రమే హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.ఆ ఒక్కరు ఎవరు అనేది మీరే డిసైడ్ చేయాలి అని హౌస్ మేట్స్ తో చెప్పారు నాగార్జున. దానికి సంబంధిన ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. దామిని,రతిక, శుభ శ్రీ ల లో ఎవరు హౌస్ లో అడుగు పెడతారు అని ఉత్కంఠ గా మారింది.