Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం ఎలా ఉన్నా వీకెండ్ వచ్చిందంటే నాగార్జున సందడి చేస్తారు. ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన దామిని,రతిక,శుభశ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరికి మాత్రమే మళ్ళీ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వారు ఎవరో మీరే డిసైడ్ చేసి చెప్పాలి అని షాక్ ఇచ్చాడు నాగార్జున.
ఈ రోజు ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి,హీరోయిన్ శ్రీ లీల సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా స్పెషల్ గెస్ట్స్ గా వచ్చారు. మీరు ఈ సీజన్ చూస్తున్నారా ఎలా ఉంది ఉల్టా పుల్టా అని అడిగారు నాగార్జున.ఒకటి రెండు ఎపిసోడ్స్ తప్ప అన్ని చూశాను. ఈ సీజన్ మాత్రం టాప్, అల్టిమేట్. సీజన్, సీజన్ పెరగడంతో పాటు మీ గ్లామర్ కూడా పెరుగుతుంది అని అనిల్ రావిపూడి నాగార్జున ని పొగడ్తలతో పడేసాడు.
ఇక హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ మా అన్న శివాజీ అన్న పేస్ చూడండి పాపం ‘నేను వచ్చే దారిలో తిరగని కాఫీ షాప్ లేదు’ అంటూ శివాజీ కాఫీ గోల గురించి మాట్లాడాడు. తేజ గురించి చెప్పు అని నాగార్జున అనగానే తేజ నా జూనియర్ బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పారు అనిల్. అనిల్ అన్న కాలేజీలో నా సీనియర్ సర్ అని తేజా అనగానే నువ్వు మళ్ళీ అది చెప్పాలా అంటూ తేజ కి రివర్స్ కౌంటర్ వేశాడు నాగార్జున.
మీరేం మాట్లాడంలేదు ఏంటి అండి అంటూ అమర్ శ్రీ లీల తో అనగానే మీరు బాగున్నారు అండి అంటూ పొగిడింది. అమర్ కి అంతగా అర్ధం కాలేదేమో సింపుల్ గా థాంక్యూ అని కూర్చోబోయాడు. వెంటనే నాగార్జున అమర్ నీకు అర్ధం కాలేదా నువ్వు బాగున్నావ్ అంటుంది. ఆ మాట వినగానే అమర్ ఆనందంలో తేలిపోయాడు. సిగ్గు పడుతూ థాంక్యూ అని చెప్పాడు.
అందుకే పూర్తిగా విను అమర్ అని ఆటపట్టించాడు నాగ్. శోభా క్రాకర్, యావర్ ఒక డైలాగ్ చెప్పు అని అనిల్ అడిగారు. వచ్చి రాని తెలుగుతో మాస్ మూవీ డైలాగ్ ఖూనీ చేశాడు యావర్. అమ్మో అది నా డైలాగ్ నేను గుర్తు పట్టలేదు అని నాగార్జున షాక్ అయ్యాడు.ఇలా సరదా సరదాగా ప్రోమో ముగిసింది. అసలైన మజా రావాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
Sunday Funday with @sreeleela14 and @AnilRavipudi: Watch the Fun Moments with Contestants in the Bigg Boss House! 😄📷 #BiggBossTelugu7 #StarMaa@iamnagarjuna
@DisneyPlusHSTelLink: https://t.co/IugZPG43p8
— Starmaa (@StarMaa) October 15, 2023