https://oktelugu.com/

Rakul Preet Singh : మొత్తం కనపడేలా పొట్టి బట్టలేసుకొని వచ్చిన రకుల్.. చూసి అంతా షాక్.. వైరల్ ఫొటోలు

ఇక రకుల్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2023 / 06:42 PM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి దూరమయ్యారు. ఆమె చివరి చిత్రం కొండపొలం. 2021లో విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ నటించి మెప్పించారు. వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంగా విడుదలైన కొండపొలం ఆశించిన విజయం సాధించలేదు. ఆ చిత్రానికి ముందు చేసిన చెక్ కూడా నిరాశపరిచింది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన థ్రిల్లర్ లో నితిన్ హీరో.

    తెలుగులో వరుస పరాజయాలు ఎదురవడంతో పాటు… హిందీలో ఆమెకు ఆఫర్స్ వస్తున్న క్రమంలో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించింది. అదే సమయంలో మన దర్శక నిర్మాతలకు ఆమె పట్ల ఆసక్తి పోయింది. ఇక హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నా బ్రేక్ రాలేదు. ఏడాది కాలంలో రకుల్ అరడజను చిత్రాల వరకు విడుదల చేసింది. అందులో ఒక్కటి కూడా ఆడలేదు. ఇటీవల ఛత్రీవాలీ టైటిల్ తో ఓ మూవీ చేయగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

    ఛత్రీవాలీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం రకుల్ నటిస్తున్న సౌత్ ప్రాజెక్ట్స్ లో భారతీయుడు 2 ఒకటి. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ మధ్య వివాదాలతో ఈ చిత్రం ఆగిపోయింది. విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ తిరిగి ప్రారంభించారు. ఈ మూవీలో కాజల్ మెయిన్ హీరోయిన్. రకుల్ సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం.

    తెలుగు ప్రేక్షకులు రకుల్ ని బాగా మిస్ అవుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంటున్నారు. హాట్ ఫొటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా పొట్టిబట్టల్లో ఓ ఫోన్ లాంచ్ ప్రోగ్రాంకు వచ్చింది. అది మరి కురుచుగా టైట్ గా ఉండడంతో రకుల్ అందాలన్నీ పైకి కనపడుతున్నాయి. ఇది చూసి అమ్మడి అందాలన్నీ చూసి అంతా షాక్ అయ్యారు. నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.