Waltair Veerayya Story Leak: వాల్తేరు వీరయ్య టైటిల్ కి సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. టీజర్ అయితే రికార్డు వ్యూస్ తో దుమ్మురేపుతోంది. 9 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన టీజర్ యూట్యూబ్ లో నంబర్ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది. చిరంజీవి ఊరమాస్ అవతార్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వింటేజ్ చిరును గుర్తు చేసిన వీరయ్య గెటప్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు బాబీపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కాలర్ ఎగరేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న వాల్తేరు వీరయ్య కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా వాల్తేరు వీరయ్య స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. కథ ఇదేనంటూ టాలీవుడ్ లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర ఏంటి? చిరంజీవి పాత్రతో ఆయన పాత్రకు ఎలాంటి లింక్ ఉంటుంది? అనే సందేహాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కొత్తగా తెరపైకి వచ్చిన వాదన ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
ఈ మూవీలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారట. అయితే వీరు ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు తల్లుల కొడుకులు అట. సవతి తల్లుల పిల్లలైన చిరంజీవి, రవితేజ మధ్య ఆధిపత్యపోరు ఉంటుందట. ముఖ్యంగా రవితేజకు అన్నయ్య అంటే పడదట. ఒక ప్రక్క శత్రువులను ఎదురిస్తూనే… అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ సాగుతుందట. అది సినిమాకు హైలెట్ కానుందని టాలీవుడ్ వర్గాల వాదన. ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ, ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తున్నాయి.

కాగా గతంలో రవితేజ చిరంజీవికి తమ్ముడుగా నటించారు. అన్నయ్య మూవీలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకడిగా ఆయన కనిపించారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నయ్య మూవీ సూపర్ హిట్ గా నిలిచింది .ఆ సెంటిమెంట్ కలిసొచ్చినా వాల్తేరు వీరయ్య సినిమాకు ప్లస్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కెరీర్లో మొదటిసారి చిరంజీవితో జతకడుతున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.