Bigg Boss 6 Telugu- Geetu vs Rohit: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యినప్పటి నుండి ఇంటి సబ్యులకు మరియు ప్రేక్షకులకు ‘ఇదేమి యాటిట్యూడ్ రా బాబు’ అనిపించేలా చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గీతూ రాయల్ అనే చెప్పొచ్చు..ప్రారంభం లో రేవంత్ కూడా కాస్త అలాగే అనిపించినా, అతనికి నోటి దూల తప్ప అన్ని కరెక్టుగానే ఉంటుంది అని రోజులు గడిచే కొద్దీ ఇంటి సబ్యులకు మరియు ప్రేక్షకులకు అర్థం అయ్యింది..అందుకే ఆయన టాప్ 1 స్థానం లో మొదటి వారం నుండి నేటి వరుకు కొనసాగుతూనే ఉన్నాడు.

కానీ గీతూ రాయల్ మాత్రం మొదటి వారం ఎలా ఉందొ ఇప్పటికి అలాగే ఉంది..ఆమె యాటిట్యూడ్ ఇప్పటికి హౌస్ మేట్స్ ఎవ్వరికి నచ్చదు..అంతే కాకుండా గీతూ మొదటి నుండి ఫిజికల్ గా ఆడడం కంటే తెలివిగా ఆడడమే తన స్ట్రాటజీ గా పెట్టుకొని ఆడుతూ వస్తుంది..అందుకే ఆమె ఇన్ని రోజులు హౌస్ లో ఉంది..ఆ తీరుకి సోషల్ మీడియా లో కూడా ఫాన్స్ ఎక్కువే.
అయితే గత వారం జరిగిన సర్వైవల్ టాస్కులో గీతూ ఆడిన కన్నింగ్ గేమ్ ని మొత్తం నిన్న నామినేషన్స్ లో రోహిత్ బయటపెట్టేసాడు..ఆయన గీతూ తో మాట్లాడుతూ ‘నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదని నీకు తెలుసు..కానీ మొన్న జరిగిన టాస్కులో శ్రీహన్ ని మరియు ఆది రెడ్డి ని లాగడానికి ఎందుకు వాళ్ళ చెయ్యి పట్టుకున్నావ్’ అని అడుగుతాడు..అప్పుడు గీతూ దానికి సమాధానం చెప్తూ ‘ఎందుకంటే వాళ్లిదరు స్ట్రాంగ్ కాబట్టి..నేను ఆదిరెడ్డి ని బొమ్మలు తీసుకోకుండా అతని చెయ్యిని ఆపాను తెలుసా నీకు’ అని అడుగుతుంది..అప్పుడు రోహిత్ దానికి సమాధానం ఇస్తూ ‘నువ్వు ఎంత ప్రయత్నం చేసిన ఆది రెడ్డి ని శ్రీహన్ ని ఆపలేవు అని నీకు తెలుసు..వాళ్ళు నిన్ను చాలా తేలికగా విడిపించుకోగలరు..ఇవతల పక్క ఫైమా మరియు కీర్తి ఉన్నారు..వాళ్ళని ఎందుకు నువ్వు లాగలేదు’ అని అడగగా గీతూ తెల్ల మొహం వెస్తాది.

అప్పుడు రోహిత్ కొనసాగిస్తూ ‘నువ్వు ఎదో పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాను అని అందరికి నిరూపించుకోవడానికి వాళ్ళని పట్టుకున్నట్టు నాకు అనిపించింది..నీ వల్ల మా గేమ్ ప్లాన్ చెడిపోయింది..నువ్వు వాళ్ళని లాగవని శ్రీహాన్ మా వైపు వచ్చి మమల్ని ఈడ్చుకొని పోయాడు’ అంటూ కరెక్ట్ పాయింట్స్ తో గీతూ ని అడిగాడు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది.