https://oktelugu.com/

S. S. Rajamouli: రాజమౌళి దృష్టిలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా? ఓపెన్ గా చెప్పేసిన జక్కన్న!

ఇండస్ట్రీ ఏదైనా నెంబర్ వన్ ఎవరనేది ముఖ్యం. ఈ నెంబర్ గేమ్ అందరినీ ఆకర్షిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎవరు టాప్ అని గమనిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అరడజను మంది స్టార్స్ గా ఉన్నారు. వీరిలో నెంబర్ వన్ ఎవరో.. దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో తేల్చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 12, 2024 / 12:22 PM IST
    Follow us on

    S. S. Rajamouli: ఒక హీరో స్టార్డం అని ఆయన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్. విజయాలు, కలెక్షన్స్, మార్కెట్ పరిధి తెలియజేస్తాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్ టాప్ స్టార్స్ గా ఉన్నారు. ఈ జెనరేషన్ కి ముందు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టైర్ వన్ హీరోలు. వీరిలో చిరంజీవి నెంబర్ వన్ అనడంలో సందేహం లేదు. చిరంజీవి పేరిట ఎవరూ అందుకోలేని రికార్డ్స్ ఉన్నాయి. 
     
    పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమాలపై దృష్టి తగ్గించారు. లేదంటే ఆయనకున్న స్టార్డం, ఫ్యాన్ బేస్ కి బాక్సాఫీస్ బద్దలు అవుతుంది. మిగిలిన వారందరు పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ.. ఆయనకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. 
     
    ప్రముఖ మీడియా సంస్థ జరిపిన సర్వేలో టాప్ 5 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో మహేష్ ఉన్నాడు.టాలీవుడ్ స్టార్స్ అందరిలో, ఒకరిని మరొకరు ఢీ కొనే సత్తా ఉంది. ఒక్కొక్కరు భారీ మార్కెట్ కలిగి ఉన్నారు. మరి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు?… ఈ ప్రశ్నకు దర్శకధీరుడు రాజమౌళి ఒకసారి సమాధానం చెప్పాడు. ఈ తరం హీరోల్లో నెంబర్ వన్ ఎవరని ఆయన్ని ప్రశ్నించగా.. నాకు తెలిసి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అంటే సీనియర్ ఎన్టీఆర్. ఆయన తర్వాతే ఎవరైనా. ఇక నెంబర్ 2 పొజీషన్ మెగాస్టార్ చిరంజీవికి ఇస్తాను. 
     
    వీరిద్దరూ నెంబర్ వన్, నెంబర్ టు హీరోలు. ఈ తరం హీరోల్లో నెంబర్ వన్ అంటూ ఎవరూ లేరు. ఎవరికి వారే ప్రత్యేకత, స్టార్డం, ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు. కాబట్టి నా అభిప్రాయంలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అంటూ ఎవరూ లేరు అన్నారు. కాగా రాజమౌళి అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు తీశారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ వీరి కాంబోలో వచ్చాయి. 
     
    అనంతరం ప్రభాస్ తో మూడు సినిమాలు చేశారు. ఛత్రపతి వీరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం. అనంతరం బాహుబలి, బాహుబలి 2 చేశారు. రామ్ చరణ్ తో మగధీర, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు తెరకెక్కించారు. నితిన్, సునీల్, నాని, రవితేజతో ఒక్కో చిత్రం చేశారు. నెక్స్ట్ మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. వీరి కాంబోలో  ఇది.