Vishwambhara Teaser Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో వస్తున్న విశ్వంభర సినిమా గత రెండు సంవత్సరాల నుంచి సెట్స్ మీదనే ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ప్రతి ఒక్కరిలో చాలావరకు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు మెగా బ్లాస్ట్ అనౌన్స్మెంట్ అంటూ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక వీడియోను చేసి కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియోలో చిరంజీవి విశ్వంభర సినిమా గురించి మాట్లాడుతూ ఆగస్టు 21 వ తేదీన అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా చిరంజీవి చెప్పేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ చిరంజీవి చెప్పిన మాట ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
నిజానికి ఈ సినిమా రిలీజ్ లేటవ్వడానికి గల కారణాలను కూడా చిరంజీవి ఈ వీడియోలో వివరించాడు. అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ సినిమాను చేస్తున్నాం అని విజువల్ వండర్ గా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నామని అందువల్లే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
అందువల్లే ఈ సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతుంది అంటూ చిరంజీవి చెప్పాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని గ్రాఫిక్స్ తో ముడిపడి ఉండడం వల్ల ఈ సినిమా రిలీజ్ ని డిలే చేయాల్సి వస్తుంది అంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
గత కొన్ని రోజుల నుంచి మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికి ఎప్పటికప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయడం వల్ల వాళ్ళు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా చిరంజీవి మాత్రం వచ్చే వేసవిలో ఈ సినిమాని తప్పకుండా తీసుకొస్తాను అంటూ భరోసా ఇవ్వడంతో ప్రతి ఒక్కరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…