Rajamouli Mahesh Babu Movie Ticket Prices: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో కూడా మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇక దాంతోపాటు ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనే ఒక దృఢ సంకల్పంతో రాజమౌళి ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పుడు ఆయన మొదటిసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల జనాలు పెద్దగా థియేటర్ కి రావడం లేదు. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది.
Also Read: భారతదేశంలో అత్యంత సంపన్న జిల్లాలు: మన రంగారెడ్డి నంబర్ 1
ఆ సినిమాలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. మరి మరోసారి రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం భారీ రేంజ్ లో టిక్కెట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పెట్టిన బడ్జెట్ 1000 కోట్లు కాబట్టి 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రావాలి అంటే సినిమా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో సినిమా ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. కానీ థియేటర్లో పెరిగిన టికెట్ రేట్ల పరిస్థితిల వల్ల చిన్న సినిమాలు మాత్రం ఆడలేకపోతున్నాయి. ఒకరకంగా రాజమౌళి వల్ల ఎంత ప్లస్ జరిగిందో అంతే మైనస్ కూడా జరిగింది.
మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మరోసారి ఆయన సినిమా వచ్చి టికెట్ రేట్లు పెంచితే ఇక జనాలు ఇతర హీరోల సినిమాల విషయంలో అసలు థియేటర్లకు వెళ్లాలనే ఆలోచనను కూడా మానుకుంటారు. మరి ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నట్టుగా ట్రేడ్ పండితుల నుంచి కొన్ని అంచనాలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది…