Vishwambhara Story review: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి అయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ ఇది భారీ VFX ఆధారిత సినిమా కావడంతో మేకర్స్ క్వాలిటీ విషయం లో ఎక్కడా తగ్గడం లేదు. టీజర్ ద్వారా వచ్చిన ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకున్నారు. అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా VFX టీం లో మార్పులు చేర్పులు చేసి ఈసారి తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేస్తానని రీసెంట్ గా ఆ చిత్ర దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీని గురించి చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఈ సినిమా స్టోరీ కూడా ఆయన ఈ ఇంటర్వ్యూ లో రెవీల్ చేసాడు. ఇలాంటి జానపద చిత్రాల స్టోరీలను మనం చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం.
Also Read: వేశ్య పాత్ర చేసిన అమ్మాయి రియల్ లైఫ్ బయటపెట్టిన రానా… అందరికీ మైండ్ బ్లాక్
హీరో హీరోయిన్ కోసమో, లేదంటే తన కుటుంబ సభ్యుల కోసమో వేరే లోకానికి వెళ్లి యుద్ధం చేసి, తమకు కావాల్సిన వాళ్ళను తీసుకొస్తుంటారు. చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా ఇదే లైన్ మీద వచ్చింది. ఈ చిత్రాన్ని చూసే అదే స్టోరీ లైన్ మీద వందల సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘విశ్వంభర’ చిత్రం కూడా అదే స్టోరీ లైన్ మీద తెరకెక్కింది అని డైరెక్టర్ ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ హీరోయిన్ ని రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటాడు. హీరో 14 లోకాలను దాటుకొని సత్య లోకం లోకి వెళ్లి హీరోయిన్ ని ఎలా తీసుకొచ్చాడు అనేదే స్టోరీ’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఈ సినిమాలో చిరంజీవి కి ఒక కొడుకు కూడా ఉంటాడట. అతనితో ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్సు ని కట్టిపారేస్తుందట.
Also Read: బిగ్ బాస్ కి వెళితే టైటిల్ నాదే, నాగార్జునకే ఛాలెంజ్ విసిరిన సీరియల్ బ్యూటీ
సాధారణంగా కొత్త కథలను పుట్టించడం ప్రస్తుతం చాలా కష్టమే. ఉన్న కథలనే సరికొత్త స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేసి ఆడియన్స్ ని అలరిస్తే చాలు. విశ్వంభర కూడా అలా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ఆయాకాశమే హద్దు అనే విధంగా ఉంటాయి. ఇకపోతే ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేస్తారని అది కూడా సెప్టెంబర్ లోనే ఉంటుందని ఒక ప్రచారం జరిగింది. దీని పై వశిష్ఠ స్పందిస్తూ 80 శాతం వరకు VFX వర్క్ పూర్తి అయ్యిందని. ఇంకా 20 శాతం బ్యాలన్స్ ఉందని, మొత్తం అయిపోయాక ఫైనల్ ఔట్పుట్ చూసుకొని నాకు బాగుంది అనిపిస్తేనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఒప్పుకుంటాను అప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించము అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని చూసిన తర్వాత డైరెక్టర్ వశిష్ఠ మంచి క్లారిటీ తోనే ఉన్నాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్.