Homeఆంధ్రప్రదేశ్‌Roja Cries: నా పిల్లల్ని కూడా.. బోరున ఏడ్చేసిన రోజా.. వీడియో

Roja Cries: నా పిల్లల్ని కూడా.. బోరున ఏడ్చేసిన రోజా.. వీడియో

Roja Cries: రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా ఉండాలి. అందునా మహిళా నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ప్రత్యర్థులను ఒక మాట అంటే రెండు మాటలు పడాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి రోజా( RK Roja) వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థులపై ఆమె విరుచుకుపడే తీరు అభ్యంతరకరంగా ఉంటుంది. అయితే అధికారంలో ఉంటే పర్వాలేదు కానీ.. అధికారం లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు మాజీ మంత్రి రోజా అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో తీవ్ర కలత చెందిన ఆమె.. మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తనతో పాటు తన పిల్లలను వదలకుండా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీవీ డిబేట్లో రోదించారు. ఒక మహిళగా, ఒక తల్లిగా ఆమె బాధపడడంలో తప్పులేదు. కానీ ఆమె సైతం తన ప్రవర్తనను ఒక్కసారి మననం చేసుకోవాలి.

Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!

* రాజకీయాల్లో దూకుడుగా.. రాజకీయాల్లో( Political career ) మహిళలు రాణించడం అంత ఈజీ కాదు. సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు రోజా. చాలా ఇబ్బందులు పడుతూ రాజకీయంలో మంత్రి స్థాయికి ఎదిగారు. అయితే పదవులు అయితే అనుభవించారు కానీ వివాదాస్పద ముద్ర తనకు తానుగా తెచ్చుకున్నారు. ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడే క్రమంలో వ్యక్తిగత విమర్శలు చేస్తారు. వయస్సు హోదా చూడరు. రాజకీయ ఉన్నతికి పాటుపడే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై నిత్యం విరుచుకుపడుతుంటారు. ఈ క్రమంలోనే ఆమె అందరికీ టార్గెట్ అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళా నేతలు ఉన్నారు. కానీ ఎవరికీ లేని విధంగా కేవలం మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేసుకోవడం వెనుక ఆమె ప్రవర్తనే ప్రధాన కారణం.

* అప్పట్లో విమర్శలు అలా..
అధికారంలో ఉన్నప్పుడే మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి( Bandar Satyanarayana Murthy ). అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మహిళగా రోజాపై సానుభూతి వ్యక్తం అయింది. సాటి సినీ నటులు ఆమెకు సంఘీభావం తెలిపారు. అయితే ఓ రాజకీయ నాయకురాలిగా ఆమె నోటి నుంచి వచ్చే పురుష పదజాల పట్ల మాత్రం ఎక్కువమందికి వ్యతిరేక భావన ఉంది. కానీ అది గుర్తు చేసుకొని ఆమె.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు టార్గెట్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. విధానపరమైన, సిద్ధాంతపరమైన అంశాలు మాత్రమే రోజా మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

* అభిమానుల కంటే ప్రత్యర్థులే అధికం..
మొన్నటి ఎన్నికల్లో నగిరి( Nagari constitution) నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోజా. ఆమెపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ గెలిచారు. కానీ ఆయన దూకుడు కలిగిన యువనేత. పైగా రోజా చేతిలో ఒకసారి ఓడిపోయారు. గాలి భాను ప్రకాష్ అనే నేత నగిరి ఎమ్మెల్యే మాత్రమే. కానీ రోజా మాత్రం వైసీపీ రాష్ట్ర నేత. ఆపై అభిమానుల కంటే ఆమెను వ్యతిరేకించే వారిని ఎక్కువగా సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె దూకుడు తనం ఆమె నచ్చని వారికి ఇబ్బందికరంగా మారింది. అందుకే వారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ పై సంచలన ఆరోపణలు చేశారు రోజా. దానిని తిప్పి కొట్టే క్రమంలో రోజా రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనికైనా సిద్ధం అంటూ భాను ప్రకాష్ తిరిగి విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన రోజా కన్నీటి పర్యంతం అవుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version