Rana interview viral: ఐకానిక్ మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో వేశ్య పాత్ర చేసిన ఓ అమ్మాయి రియల్ లైఫ్ గురించి తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. సదరు నటి దర్శకురాలిగా కూడా మారింది. ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్న రానా… ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
Also Read: బిగ్ బాస్ కి వెళితే టైటిల్ నాదే, నాగార్జునకే ఛాలెంజ్ విసిరిన సీరియల్ బ్యూటీ
సినిమా అనే కళ పూర్తిగా కమర్షియల్ యాంగిల్ తీసుకుంది. స్టార్ హీరోలు చేసేవన్నీ కమర్షియల్ చిత్రాలే. భౌతిక సూత్రాలతో సంబంధం లేని ఫైట్స్, కథకు అవసరం లేని పాటలు, ఎలివేషన్స్ భారీ చిత్రాల్లో చూడొచ్చు. అలాంటి సినిమాలు తీసే దర్శకులను, హీరోలను తప్పుబట్టడానికి వీల్లేదు. మెజారిటీ ఆడియన్స్ కోరిందే వారు ఇస్తున్నారు. దిగ్దర్శకులుగా, బడా స్టార్స్ గా ఎనలేని కీర్తి అనుభవిస్తున్నవారు… ఈ తరహా చిత్రాలు చేసేవారే. చంద్రశేఖర్ ఏలేటి, మణికంఠ, దేవా కట్ట, క్రిష్ వంటి దర్శకులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు. కానీ వారి ప్రస్తుత పొజిషన్ ఏమిటో మనకు తెలుసు.
అయితే జయాపజయాలతో.. లాభాపేక్ష లేకుండా సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకులు ఇంకా లేకపోలేదు. సినిమాను ఫ్యాషన్ గా తీసుకుని కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేసే తపన ఉన్న మేకర్స్ ఈ జనరేషన్ లో కూడా ఉన్నారు. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం ఒక సంచలనం. కొత్తవారితో చేసిన ఆ ప్రయోగాత్మక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. వాటిలో వేశ్య అయిన సలీమా ఒకటి. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కోపంతో ఆమెను హత్య చేస్తారు.
సలీమా పాత్ర చేసిన అమ్మాయి పేరు ప్రవీణ పరుచూరి. ఈమె రియల్ లైఫ్ ఏమిటో దగ్గుబాటి రానా వెల్లడించారు. సాధారణంగా వేశ్య పాత్రలు చేసే హీరోయిన్స్ మీద తక్కువ అభిప్రాయం ఉంటుంది. అందుకే చాలా మంది హీరోయిన్స్ వేశ్యగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు ఇష్టపడరు. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు ప్రవీణనే నిర్మాత. నటన మీదున్న ఫ్యాషన్ తో ఛాలెంజింగ్ రోల్ చేసింది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి కూడా ఆమెనే నిర్మాతగా ఉన్నారు.
Also Read: మహేష్ బాబు చేసిన సినిమాల్లో రాజమౌళికి నచ్చని సినిమా అదేనా..?
నటిగా, నిర్మాతగా ఉన్న ప్రవీణ తాజాగా దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు టైటిల్ తో విలేజ్ డ్రామా తెరకెక్కించారు. ఈ చిత్రం జులై 18న థియేటర్స్ లోకి వచ్చింది. కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించింది. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ… ఒక సినిమా చేయాలి అంటే ఉన్న ప్రాంతాన్ని కొన్నాళ్ళు వదిలేయాలి. ప్రవీణ అమెరికాలో కార్డుజియాలిస్ట్ గా ఉండి, తెలుగు సినిమాలపై ఉన్న మక్కువతో నిర్మాతగా మారింది. ఇప్పుడు కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రంతో దర్శకురాలిగా మారుతుంది అన్నారు. ప్రవీణకు సినిమాపై ఉన్న మక్కువను రానా కొనియాడారు.

