Vishwambhara Movie Shooting: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). ఈ సినిమా ఎప్పుడో 2024 వ సంవత్సరం లోనే విడుదల అవ్వాల్సింది. కానీ VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం, చేసిన VFX డైరెక్టర్ కి నచ్చకపోవడం తో రీ వర్క్స్ కారణంగా ఇన్ని రోజులు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక టీజర్, ఒక పాట విడుదలైంది. పాటకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, టీజర్ కి మాత్రం ఘోరమైన డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అమీర్ పెట్ గ్రాఫిక్స్ అంటూ ఈ చిత్రాన్ని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు నెటిజెన్స్. మెగా అభిమానులు కూడా VFX వర్క్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే టీం మొత్తాన్ని మార్చి, క్వాలిటీ కోసం మళ్లీ కొత్తగా పనిచేయడం వల్ల ఇంత సమయం పట్టింది.
అయితే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యిందని అనుకుంటే పొరపాటే. ఇంకా రెండు రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. నాగబంధం థీమ్ సాంగ్ ని ఒకటి మెగాస్టార్ చిరంజీవి పై తీయాల్సి ఉందట. దీనికి కోసం దాదాపుగా పది కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. అయితే గత ఏడాది చిరంజీవి, మౌని రాయ్ లపై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించిన తర్వాత, షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని డైరెక్టర్ వశిష్ఠ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చూస్తే మరో రెండు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని అంటున్నారు, ఇది కూడా షూట్ చేసిన తర్వాత ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉందని చెప్తారా ఏంటి? అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా కు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కట్ చేసే పనిలో ఉందట మూవీ టీం.
లేటెస్ట్ గా వచ్చిన VFX షాట్స్ అన్నిటిని ఈ ట్రైలర్ లో పొందుపరిచారట. మెగా అభిమానులకు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ సినిమా పై అమితాసక్తి కలిగించే రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రాన్ని జులై నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విడుదల తేదీ పై మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. అతి త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషించింది. అదే విధంగా సురభి,ఇషా చావ్లా వంటి వారు ఈ చిత్రం లో చిరంజీవి కి సోదరీమణులు లాగా నటించారు.