Italy cricket team : ప్రస్తుతం మన దేశం, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో ఈసారి 19 దేశాలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఇటలీ కూడా ఉంది.. ఈ దేశంలో ఆడుతున్న ప్లేయర్లలో చాలామంది ఇతర దేశాలకు చెందినవారు.
ఇటలీ క్రికెట్ జట్టులో క్రిషన్ కలుగమాగే ఆడుతున్నాడు. ఇతడు శ్రీలక దేశానికి చెందినవాడు. క్రిషన్ ప్రొఫెషనల్ పిజ్జా చెఫ్.. అలాగే అద్భుతమైన క్రికెటర్. ప్రస్తుత ఐసీసీ పురుష టి20 ప్రపంచ కప్ లో యూరోపియన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు క్రికెటర్లలో ఇతడు ఒకడు.
ఇటలీ జట్టులో ఉన్న ప్లేయర్లలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరిలో ఎవరూ ఇటలీలో నివసించరు. కనీసం ఇటాలియన్ కూడా మాట్లాడలేరు. అంతర్జాతీయ క్రికెట్ నియత్రణ మండలి నిబంధనలు ఎత్తివేయడం వల్ల ఇతర దేశాలకు చెందిన వారు ఇటలీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇటలీ దేశంలో ఫుట్ బాల్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. మనదేశంలో క్రికెట్ కు ఏ స్థాయిలో అయితే క్రేజ్ ఉంటుందో.. ఇటలీలో ఫుట్ బాల్ కు అదే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఇటలీ జట్టు నాలుగు సార్లు ఫిఫా ప్రపంచ కప్ గెల్చుకుంది. పాలో మౌల్దిని, జియాన్ లుయిగి బఫన్, ఫ్రాంకో బరేసి, పాలో రోస్సీ వంటి ప్లేయర్లు ఇటలీ జట్టుకు ఫుట్ బాల్ లో తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు.
ఇటలీలో క్రికెట్ కు ఆదరణ అంతంత మాత్రమే. అటువంటి ఆ దేశంలో క్రికెట్ ఆదరణ కలిగే విధంగా అడుగులు వేస్తున్నాడు క్రిషన్ . ఇతడికి 15 సంవత్సరాలలో వయసులో ఉన్నప్పుడు శ్రీలంక నుంచి ఇటలీలోని తస్కాని ప్రాంతంలోని లూకా అనే ఏరియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు పిజ్జా చెఫ్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. టి20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో అతడు కూడా చేరాడు.
ఫిజ్జా చెఫ్ గా ఉన్నప్పటికీ క్రికెట్ మీద విపరీతమైన ఇష్టంతో సెలవు దినాలలో మైదానంలోకి వెళ్ళిపోయేవాడు. క్రికెట్ ను విపరీతంగా సాధన చేశాడు. తద్వారా అతడు అనేక సందర్భాలలో పిజ్జా చెఫ్ ఉద్యోగాలు కోల్పోయాడు. ఇటలీ క్రికెట్ కోచ్ గా జాన్ డేవిడ్ సన్ పనిచేస్తున్నాడు. అతడికి క్రిషన్ అంటే చాలా ఇష్టం. ” అతడు మా జట్టులో వజ్రాయుధం లాంటి వ్యక్తి. రెండువైపులా అతడు బంతిని అత్యంత పదునుగా తిప్పగలడు” అని క్రిషన్ గురించి వ్యాఖ్యానించాడు.
ఇటలీ జట్టులోకి జాన్ జాన్ స్మట్స్ అనే ఆటగాడు కూడా ఎప్పుడూ ఆ దేశానికి వెళ్లలేదు. స్మట్స్ దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు. ఇతడు జూడి కాస్టిక్నా అనే ఇటాలియన్ మహిళను వివాహం చేసుకున్న నేపథ్యంలో.. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడు దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆరు వన్డేలు,16 t20 లు ఆడాడు.
ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ దక్షిణాఫ్రికాకు చెందినవాడు. ఇతడు డర్బన్ నగరంలో జన్మించాడు. ఇతడి అమ్మమ్మ ఇటాలియన్ కావడంతో.. టి20 ప్రపంచ కప్ లో ఇటలీకి ప్రాతినిధ్యం వహించడానికి అతడు అర్హత పొందాడు. “ప్రజలు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. కానీ, మా మధ్య నిజమైన ఐక్యత ఉంది. ఒక సమూహంగా మేం పొందే అనుభూతిని వర్ణించడం చాలా కష్టమని” వేన్ ఇటీవల బీబీసీతో అన్నాడు.
మరోవైపు ఇటలీ క్రికెటర్లు గొప్ప ఆట తీరు ప్రదర్శిస్తారని.. భవిష్యత్తులో ఉత్తమమైన ఆట ఆడతారని స్మట్స్ బలంగా నమ్ముతున్నాడు. “గతంలో ఇటలీలో ఎవరూ రగ్బీ ని ఆడలేదు. ఇప్పుడు ఇటలీ దేశంలో చాలామంది రగ్బీ ఆడుతున్నారు. ఇదే సూత్రం భవిష్యత్తులో ఇటలీలో క్రికెట్ కు కూడా వర్తిస్తుందని” స్మట్స్ ఈఎస్పీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.