Vijay: మరో రెండు నెలల్లో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఈ ఎన్నికల పై దేశవ్యాప్తంగా ఫోకస్ ఉండబోతుంది. ఎందుకంటే తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ద్వారా పోటీ చేయబోతున్నాడు కాబట్టి. ఒకప్పుడు రజినీకాంత్ తమిళనాడు లో సినిమాల పరంగా ఏ రేంజ్ పీక్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేశాడో, ప్రస్తుతం విజయ్ కూడా అలాంటి పీక్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరైనా అలాంటి అద్భుతమైన కెరీర్ ని వదులుకొని బురద లాంటి రాజకీయాల్లోకి రావాలని కోరుకోరు. జనాలకు నిజమైన సేవ చెయ్యాలి అనే తపన ఉంటేనే రాజకీయాల్లోకి వస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఇలాగే వచ్చాడు. అయితే ఆయన మొదటి ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు, కానీ ఇక్కడ విజయ్ మొదటి ఎన్నికలను ఎదురుకోబోతున్నాడు.
ఫలితం ఎలా ఉండనోటుంది అనేది పక్కన పెడితే, రాజకీయం గా విజయ్ కి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, చాలా ధైర్యం గా, మొండితనం తో ముందుకు సాగుతున్నాడు. ఇకపోతే నేడు ఆయన ఏర్పాటు చేసిన రాజకీయ సభలో మాట్లాడుతూ ‘ఇతర రాజకీయ పార్టీలు మీ అమూల్యమైన వోటుని కొనుగోలు చేయడానికి 2000 , 3000 , 4000 అంటూ డబ్బులిస్తారు. అలా ఇస్తే తీసుకోండి , అందులో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే అది మీ డబ్బే. కానీ ఓటు మాత్రం మన TVK పార్టీ కి వెయ్యండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ డైలాగ్ ని ఎక్కడో విన్నట్టు ఉందే అని మీకు అనిపిస్తుంది కదూ. ఇది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్నికల్లో తరచుగా ఉపయోగించే డైలాగ్. 2019 ఎన్నికల ప్రచారం సమయం లో ఈ డైలాగ్ ని ఆయన ఒక రేంజ్ లో ఉపయోగించాడు.
అంతే కాకుండా 2024 ఎన్నికల ముందు ఆయన చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ సభల్లో కూడా ఈ డైలాగ్ ని తరచూ ఉపయోగించేవాడు. ఇప్పుడు అదే డైలాగ్ విజయ్ నోటి నుండి రావడాన్ని చూస్తుంటే, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను చూసి విజయ్ ఇలా మాట్లాడాడా?, లేదంటే పవన్ కళ్యాణ్ లాగానే ఆయన కూడా ఆలోచించాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే విజయ్ గతం లో మన తెలుగు సినిమాలను ఎన్నో తమిళం లో రీమేక్ చేసాడు, అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టీ ఆయన అన్నీ దగ్గరుండి పరిశీలించి తనకు బెస్ట్ అనిపించిందే ఉపయోగించుకుంటాడని అనుకోవచ్చు. అలా పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో తనకు ఈ డైలాగ్ బాగా నచ్చి, తన రాజకీయ సభల్లో కూడా ఉపయోగించుకొని ఉండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే విజయ్ మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
“They will give ₹2,000, ₹3,000, or ₹5,000 for a vote, even with a promise in God’s name.. Take it happily.. it’s your money anyway.. Take it, whistle in their ears, and send them back..”
– #ThalapathyVijay‘s Today’s Speechpic.twitter.com/0A3wQgIrUI
— Laxmi Kanth (@iammoviebuff007) February 13, 2026