Laila Movie Trailer : విశ్వక్ సేన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా’ ఈనెల 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన రోజు నుండే ప్రేక్షకుల్లో ఎక్కడో తెలియని ఆసక్తి కలిగింది. ఎందుకంటే విశ్వక్ సేన్ తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలనీ చూస్తుంటాడు. అవి సక్సెస్ అయ్యాయి కూడా. అందుకే ఆయన అమ్మాయి వేషం వేసుకొని సినిమా చేస్తున్నాడంటే, కచ్చితంగా ఆ చిత్రంలో ఎదో విశేషం ఉంటుందని బలంగా నమ్మారు ప్రేక్షకులు. టీజర్ అంతగా ఆడియన్స్ కి నచ్చలేదు కానీ, కాసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ కి మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ స్లాంగ్ అన్ని సినిమాలకు ఒకేలా ఉంటుందని కొంతమంది చిరాకు పడుతుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన తన స్లాంగ్ ని మార్చినట్టు అనిపించింది.
గతంలో కూడా హీరోలు ఇలా అమ్మాయి వేషం వేసుకొని అనేక సినిమాలు చేసారు. కమర్షియల్ గా అవి సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. కానీ ఈమధ్య కాలం లో ఎవ్వరూ ఆ గెటప్స్ లో సినిమాలు చేయలేదు. విశ్వక్ సేన్ చాలా కాలం తర్వాత ఆ ప్రయోగం చేసాడు. ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ చాలా గట్టిగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడే అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ బాగా ఉన్నాయి కానీ, యూత్ ఆడియన్స్ కి అయితే ఈ చిత్రం తెగ నచ్చేయొచ్చు. కేవలం వాళ్ళని టార్గెట్ గా చేసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అనిపించింది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటించింది. ఈమెకు ఇదే మొట్టమొదటి సినిమా. రొటీన్ గా కాకుండా కాస్త రాజకీయ అంశాన్ని జోడించి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియన్స్ కి నచ్చితే బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగా వర్కౌట్ అవ్వొచ్చు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఈనెల 9న గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. నందమూరి హీరోలను ఎంతో అభిమానించే విశ్వక్ సేన్, మొట్టమొదటిసారి నందమూరి హీరోలను కాకుండా, మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథి గా పిలవడం హాట్ టాపిక్ గా మారింది. ‘దాస్ కా ధమ్కీ’ వంటి సూపర్ హిట్ తర్వాత విశ్వక్ చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామీ’, ‘మెకానిక్ రాకీ’ వంటి చిత్రాలు విడుదలై ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి. ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. మరి లైలా చిత్రం తో అయినా ఆయన కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.