Shekhar Basha : మగవాళ్లకు ఆడవాళ్ళ కారణంగా అన్యాయం జరిగితే మన తరుపున నిలబడి మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకునేవాళ్లకు ఈమధ్య కాలం లో శేఖర్ బాషా అనే వ్యక్తి ఒక ఆసరా గా నిలుస్తున్నాడు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో శేఖర్ బాషా కలగచేసుకొని, నిజానిజాలు బయటపెట్టడం వల్ల అప్పటి వరకు లావణ్య పై జనాల్లో ఉన్న సానుభూతి మొత్తం పోయి, రాజ్ తరుణ్ ని అయ్యో పాపం అనుకునేలా చేసాడు. ఇక వర్కౌట్ అవ్వదు అని అనుకుందో ఏమో తెలియదు కానీ రాజ్ తరుణ్ విషయాన్ని మరింత లాగకుండా మధ్యలోనే వదిలేసింది లావణ్య. ఆమె అలా చేయడం సగానికి పైగా క్రెడిట్స్ శేఖర్ బాషాకు ఇవ్వొచ్చు. ఇప్పుడు ఆయన జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ వ్యవహారం లో కూడా తలదూర్చాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణని మీడియా కి విడుదల చేసి సంచలనం సృష్టించాడు.
అంతే కాకుండా ఈ వ్యవహారం పై ఆయన ఇంటర్వ్యూ పెట్టి జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేస్తున్నాడు అనే వాదనలో ఎలాంటి నిజం లేదని, వాళ్ళిద్దరి మధ్య ఎదో గొడవ జరగడం వల్ల, శ్రేష్టి వర్మ పెద్దల సహాయంతో అతని పోలీస్ కేసు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. శేఖర్ బాషా చేసిన ఈ కామెంట్స్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కూడా మద్దతు లభించింది. అయితే శేఖర్ బాషాపై నేడు శ్రేష్టి వర్మ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోర్టు లో కేసు నడుస్తున్న ఒక వ్యవహారం గురించి, తన అనుమతి లేకుండా, నా ఆడియో రికార్డులు మీడియా కి విడుదల చేయడం చట్టరీత్యా నేరమని, దయచేసి శేఖర్ బాషాపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు నార్సింగి పోలీసులు శేఖర్ భాషపై బీఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై నెటిజెన్స్ నుండి కౌంటర్లు వినిపిస్తున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న ఒక వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చట్ట రీత్యా నేరమే. కానీ శ్రేష్టి వర్మ ఏకంగా ఈ అంశంపై ఇంటర్వ్యూ ఇచ్చి జానీ మాస్టర్ గురించి సుమారుగా గంటసేపు పైగా ఆరోపణలు చేసింది. ఆమె రూల్స్ ని ఉల్లగించినట్టు, జానీ మాస్టర్ కూడా రూల్స్ ని మర్చిపోయి శ్రేష్టి వర్మ పై ఆయన వెర్షన్ ని వినిపిస్తే ఎలా ఉంటుంది?, కానీ ఆయన అలా చేయలేదుగా కదా, ఈ విషయం లో ముందుగా తప్పు చేసింది శ్రేష్టి వర్మనే, ఆమె ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.