Vishwak Sen : సినీ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) ఇంట్లో ఇటీవలే దొంగతనం జరిగిన ఘటన పెద్ద సంచలనం గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఇంట్లో దొంగతనం కి పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్తించిన ఫిలిం నగర్ పోలీసులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫిలిం నగర్(Filmnagar), రోడ్ నెంబర్ 8(Road No:8) లో ఉండే విశ్వక్ సేన్ ఇంట్లో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున దుండగులు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. వజ్రాభరణాలతో పాటు, హెడ్ ఫోన్ ని దొంగతనం చేసి అక్కడి నుండి పరార్ అయ్యారు. దొంగతనం జరిగిన రోజున విశ్వక్ సేన్ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన SI సతీష్ కుమార్, కానిస్టేబుల్స్ సురేందర్ రాధోడ్ , ఇంతియాజ్ హుస్సేన్ ఘటన స్థలం వద్ద సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు.
Also Read : ప్రేక్షకులకు విశ్వక్ సేన్ ప్రమాణం..ఇక నుండి అలా చేస్తే సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ఎమోషనల్ కామెంట్స్!
ఆ సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసుకొని, దాదాపుగా నాలుగు రోజుల పాటు 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఈ ముగ్గురు దుండగులు బేగంపేట్ లోని మయూరి మార్గ్ లో అద్దెకు ఉంటున్నట్టుగా గమనించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో కేసు ముగిసింది. ఈ ముగ్గురు కొత్తగూడెం కి చెందిన వారీగా గుర్తించారు. వీరు పేర్లు భీమవరపు స్వరాజ్ (21 ఏళ్ళు), బొల్లి కార్తీక్ (22 ఏళ్ళు), నెరుసుమల్లి సందీప్ (21 ఏళ్ళు). ఈ ముగ్గురు ఫుడ్ డెలివరీ బిజినెస్ లో పని చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎక్కువగా జల్సాలకు అలవాటు పడిన ఈ కుర్రాళ్ళు ఈజీ మనీ పై ఆకర్షితులు అయ్యారు. అందులో భాగంగా దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయారు. దాదాపుగా వారం రోజుల పాటు వీళ్ళు హీరో విశ్వక్ సేన్ ఇంటి పై రెక్కీ నిర్వహించారట.
అలా ఒక రోజు విశ్వక్ ముగ్గురూ ఒకే బైక్ లో విశ్వక్ సేన్ ఇంటి కి దగ్గర్లో చేరుకొని బైక్ ని ఆపారు. స్వరాజ్ అనే కుర్రాడు ఇంటి తాళాలను బద్దలు కొట్టి డైమండ్ రింగ్స్, హెడ్ సెట్ ని చోరీ చేసి, బైక్ వద్దకు చేరుకొని ఉడాయించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మూడు డైమండ్ రింగ్స్ ని స్వాధీనం చేసుకొని, వాళ్ళ వద్ద ఉన్న మూడు మొబైల్ ఫోన్స్ తో పాటు, ఎలక్ట్రిక్ బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ముగ్గురిని రిమాండ్ కి తరలించి, కేసు ని దర్యాప్తు చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ కుర్రాళ్ళు ఇలాంటి పనులు చేయడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు వీళ్ళని ఎలా పెంచారో అంటూ పెదవి విరుస్తున్నారు.
Also Read : విశ్వక్ సేన్ ప్రతి సినిమా రిలీజ్ కి ముందు కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారు..? ఎవరు చేస్తున్నారు..?