Vishwak Sen: ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా'(Laila Movie) ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మనమంతా చూసాము. వల్గర్ మాటలతో అడల్ట్ కంటెంట్ అంటూ ప్రచారం చేసుకొని విడుదల చేసిన ఈ సినిమాని అడల్ట్ రేటెడ్ సినిమాలను ప్రోత్సహించే యూత్ ఆడియన్స్ కూడా ఛీ కొట్టారు. విశ్వక్ సేన్ కెరీర్ కి ఈ లైలా చిత్రం ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోయింది. హీరో కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ సర్వసాధారణం. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) వంటి వారికే తప్పలేదు. కానీ సినిమా ఫలితాలను పక్కన పెడితే, పరువు తీసుకునే సినిమాలను మాత్రం చేయకూడదు. విశ్వక్ సేన్ అదే చేశాడు. క్రిటిక్స్ చేత జీరో రేటింగ్స్ ఇప్పించుకున్న హీరో గా ఈ సినిమాతో ఆయన అరుదైన రికార్డుని నెలకొల్పాడు. అయితే ఆడియన్స్ నుండి క్రిటిక్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని చూసి, విశ్వక్ సేన్ నేడు ఒక లేఖని విడుదల చేశాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల నేను చేసిన సినిమాలు మీ అంచనాలకు తగ్గట్టుగా లేవు. నా గత చిత్రానికి వచ్చిన నిర్మాణాత్మక విమర్శను నేను అంగీకరిస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం ఉంచి, నా సినీ ప్రయాణం లో మద్దతుగా నిల్చిన ప్రతీ ఒక్కరికి నేను ఈ సందర్భంగా క్షమాపణలు చెప్తున్నాను. ఇక నుండి నేను తీసేది మాస్ సినిమా అయినా, క్లాస్ సినిమా అయిన అసభ్యత ఉండకుండా ఉండేలా చూసుకుంటాను. ఆ విషయం లో నేను మీ అందరికి ప్రమాణం చేస్తున్నాను. నేను ఒక చెడు సినిమాని తీసినప్పుడు నన్ను విమర్శించే హక్కు మీ అందరికీ ఉంది. ఎందుకంటే జీరో నుండి మొదలైన నా కెరీర్ లో, ఎవ్వరూ లేని సమయంలో నాకు తోడుగా నిల్చింది మీరే కాబట్టి. మీరు ఎంత ప్రేమించారో నాకు తెలుసు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ ‘ఇక నుండి నేను చేసే ప్రతీ సినిమాలోని నా పాత్ర, మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలకు, బయ్యర్స్ కు, దర్శకులకు ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ విశ్వక్ సేన్ చాలా ఎమోషనల్ అవుతూ ఒక లేఖని విడుదల చేశాడు. బయట ఎంతో యాటిట్యూడ్ కుర్రాడిగా కనిపించే విశ్వక్ సేన్ నుండి ఇంత ఎమోషనల్ లేఖని ఆయన అభిమానులు ఊహించలేదు. అపజయాల నుండి ఎన్నో నేర్చుకుంటారని పెద్దలు అంటుంటారు, విశ్వక్ సేన్ కి కూడా ఇప్పుడు నేర్చుకునే సమయం. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, ఎంతో వయస్సు మిగిలి ఉంది, సరైన దర్శకుడి చేతిలో పడితే మన తెలుగు సినిమాకి మంచి పేరు తీసుకొచ్చే హీరోలలో ఒకడిగా నిలుస్తాడు. ఇక నుండి హీరో విశ్వక్ సేన్ సినీ ప్రయాణం అ బాటలో అడుగులేయాలని ఆశిద్దాం.