Ori Devuda Collections: విశ్వక్ సేన్ హీరోగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరిదేవుడా’ చిత్రం ఇటీవలే దీపావళి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘ఓ మై కడవలే’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రారంభం నుండి కాస్త మంచి మంచి అంచనాలే ఉన్నాయి..దానికి తోడు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అని అధికారిక ప్రకటన రావడం తో ఈ మూవీ పై అప్పటి వరుకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కానీ కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా అయితే లేవు..మొదటి రోజు కేవలం 90 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన చిత్రం రెండవ రోజు నుండి చెప్పుకోదగ్గ గ్రోత్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపలేకపోయిందనే చెప్పాలి..పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి ఒక్క రోజు కూడా కోటి రూపాయిల షేర్ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.
రెండవ రోజు ఈ సినిమాకి మొదటి రోజు కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి..మరో పక్క తమిళ డబ్బింగ్ సినిమా సర్దార్ మొదటి రోజు కంటే రెండవ రోజు అత్యధిక వసూళ్లను రాబడితే, ఓరి దేవుడా విషయం లో మాత్రం అది పూర్తి గా రివర్స్ అయ్యింది..రెండవ రోజు 66 లక్షల రూపాయిలు షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం,మూడవ రోజు 74 లక్షల రూపాయిల షేర్..నాల్గవ రోజు 90 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి పర్వాలేదు అనిపించింది..ఇక ఐదవ రోజు సుమారుగా 60 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ ని కలిపితే నాలుగు కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగింది..బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా అందుకోవాలంటే మరో కోటి 60 లక్షల రూపాయిలు షేర్ ని వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది..కానీ వీక్ డేస్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ స్టడీ గా ఉంటేనే అది సాధ్యపడుతుంది..కానీ పండగ దినాలలోనే పెద్దగా గ్రోత్ చూపించకపోవడం తో లాంగ్ రన్ కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు..బాక్స్ ఆఫీస్ పరంగా ఫుల్ రన్ లో ఎబోవ్ యావరేజ్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.