Prince Collections: తమిళనాడు లో రజినీకాంత్ , విజయ్ మరియు సూర్య తర్వాత ఫాలోయింగ్ పరంగా కానీ, బాక్స్ ఆఫీస్ పరంగా కానీ మంచి డిమాండ్ ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు శివ కార్తికేయన్..చిన్న కామెడీ ఆర్టిస్టుగా ప్రారంభమైన శివ కార్తికేయన్ కెరీర్ నేడు సౌత్ లోనే క్రేజీ స్టార్ గా ఎదిగే రేంజ్ కి వచ్చాడంటే మెచ్చుకోవాల్సిందే.

డాక్టర్ మరియు డాన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు మరియు తమిళ ఇండుస్త్రీలను ఊపేసిన ఈ కుర్ర హీరో, ఇప్పుడు లేటెస్ట్ గా జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV తో కలిసి ‘ప్రిన్స్’ అనే సినిమాని చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది..వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ కెరీర్ కి ఈ సినిమా స్పీడ్ బ్రేకర్ లాగ నిలిచింది.
ఫస్ట్ హాఫ్ అద్భుతమైన కామెడీ తో అలరించినప్పటికీ..సెకండ్ హాఫ్ సిల్లీ సన్నివేశాలతో డైరెక్టర్ ప్రేక్షకులకు చిరాకు రప్పించడం వల్లే టాక్ సరిగా రాలేదని విశ్లేషకులు చెప్తున్నారు..రోజువారీ వసూళ్లను ఒకేసారి పరిశీలిస్తే..మొదటి రోజు 90 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు 46 లక్షల రూపాయిలు..మూడవ రోజు 41 లక్షల రూపాయిలు..నాల్గవ రోజు 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఇక ఐదవ రోజు 30 లక్షల రూపాయిల షేర్ ని సాధించగా మొత్తం మీద 5 రోజులకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో రెండు కోట్ల 67 లక్షల రూపాయిలు వసూలు చేసింది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 7 రూపాయలకు జరగగా ఇక మాములు పని దినాలలో షేర్స్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడం తో ఫుల్ రన్ లో ఈ సినిమా చివరికి డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.