Ram Setu Movie Review: ‘ రామాయణంను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతీ సినిమాలో రాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు వివిధ కోణాల్లో చూపించారు. రామాణంలోని ప్రధాన ఘట్టం రామసేతును నిర్మించడం. రాముడు సీతను తీసుకురావడానికి వేసిన దారే రామసేతు. దీనిని వానర సైన్యం నిర్మించారని ఆధ్యాత్మిక వాదులు అంటుంటే.. లేదు సహజసిద్ధంగా ఏర్పడిందని ఆర్కియాలజిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందేహాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన చిత్రం ‘రామ్ సేతు’. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘రామ్ సేతు’ అక్టోబర్ 25న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

నటీనటులు:
అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, నాజర్, నుస్రత్ బరూచా..
సాంకేతికం:
డైరెక్టర్: అభిషేక్ శర్మ
నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అరుణా భాటియా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్
సంగీతం : డేనియల్ బి జార్జ్
సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా
ఎడిటింగ్: రామేశ్వరన్ ఎస్ భగత్
కథ ఎలా ఉందంటే..?
రామ్ సేతును తీసేసి అదే ప్రదేశంలో ‘సేతు సముద్రం’ పేరుతో ఓ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటారు. ఈ నిర్మాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) టేకోవర్ చేస్తాడు. ఇది జరగాలంటే అక్కడ రామసేతు లేదని భారతీయులు విశ్వసించాలి. అక్కడ రామసేతు లేదనే నమ్మకం కలగాలి. ఇందుకోసం భారత్ కు చెందిన ప్రముఖ ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ డైరెక్టర్ ఆర్యన్ (అక్షయ్ కుమార్)తో ఓ నివేదిక ఇప్పిస్తాడు. అయితే ఇది తప్పుడు రిపోర్టు అని తేలడంతో ఆర్యన్ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత పరిశోధన చేయాలని, తాను తోడుంటానని ఇంద్రకాంత్ హామీ ఇస్తాడు. దీంతో ఆర్యన్ టీం పరిశోధనకు వెళ్తుంది. వీరికి ఏపీ (సత్యదేవ్) కలిసి సాయం చేస్తాడు. అయితే చివరకు ఆర్యన్ ఎలాంటి రిపోర్టు ఇస్తాడు..? అనేది పూర్తి కథాంశం
విశ్లేషణ:
రామ్ సేతు మూవీ ఒక ప్రయోగాత్మక చిత్రం. ప్రతీ సీన్ ఇంట్రెస్టుగా సాగుతుంది. రామసేతు లాంటి కాన్సెప్ట్ తీసుకోవడం అద్భతమే. కానీ దానిని తెరపై బాగా చూపించడంలో లోపం కనిపిస్తుంది. కథలో ఉన్న ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లేలో కనిపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతారు. వాస్తవ కథకు కొన్నికల్పితాలు జోడించి నడిపించారు. వీటికి విజువల్ ఎఫెక్ట్ యాడ్ చేశారు. అవి ప్రేక్షకులను కట్టిపడేయలేదనే చెప్పాలి. కానీ రామ సేతు గురించి అనేక విషయాలు ఇందులో చెప్పారు. శ్రీలకంలో రావణాసురుడికి సంబంధించిన ప్రదేశాలను ఇందులో చూపించడం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..?
ఆర్కియాలజిస్టుగా అక్షయ్ కుమార్ అద్భుతంగా చేశాడు. కానీ తనకు తగిన విధంగా కొన్ని సీన్స్ లేవనే చెప్పాలి. ఏపీ గా సత్యదేవ్ తన పాత్రలో ఇమిడిపోయాడు. అసలు ఆయన మధ్యలో ఎందుకు వస్తాడో అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్యన్ టీం మెంబర్ గా జాక్వెలిన్ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త గా నాజర్ తన సీనియారిటీని చూపించారు.
ఎలా తీశారంటే..?
డైరెక్టర్ అభిషేక్ శర్మ కొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కానీ దానిని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. డేనియల్ బి జార్జ్ సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ కు బ్యాక్రాండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ ఆసీమ్ మిశ్రా, ఎడిటింగ్ రామేశ్వర్ ఎస్ భగత్ వారి ప్రతిభను చూపించారు.
ఫైనల్ గా రామ్ సేతు యావరేజ్ గా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: (2.25/5)