Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen Car: విశ్వక్ సేన్ కారు వైరల్.. ఇంతకీ ధర ఎంతో తెలుసా ?

Vishwak Sen Car: విశ్వక్ సేన్ కారు వైరల్.. ఇంతకీ ధర ఎంతో తెలుసా ?

Vishwak Sen Car: ‘మాస్‌ కా దాస్‌’ అంటూ విశ్వక్‌ సేన్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. పైగా రుక్సార్ దిల్లాన్‌ తో కలిసి నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మే 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా డబ్బు చేసుకుంది. అందుకే, ఈ సక్సెస్‌ ను ఈ మాస్‌ కా దాస్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. తనకిష్టమైన బెంజ్‌ జీక్లాస్‌ 2022 మోడల్‌ కారుని కొని, ఆ ఎంజాయ్ ను రెట్టింపు చేసుకున్నాడు.

Vishwak Sen Car
Vishwak Sen Car

పైగా తన కల సాకారం చేసుకున్నాను అంటూ విశ్వక్‌ చెప్పుకొచ్చాడు. ‘నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే నేను ఇది సాధించగలిగాను. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి మీకు తోడు అవసరం. నా సక్సెస్ పట్ల నేను ఎంతో ఆనందంగా ఉ‍న్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ విశ్వక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

Also Read: YS Bharathi- Sarkaru Vaari Paata: మహేష్ సినిమా పై జగన్ సతీమణి ప్రశంసలు

ఇక విశ్వక్ సేన్ పెట్టిన పోస్ట్ చూసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘అతడికి కంగ్రాట్స్ చెప్పాడు. పైగా తరుణ్ ఓ ఇంట్రెస్టింగ్ మెసేజ్ కూడా పెట్టాడు. ‘ఆ కారు నాదే.. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చినా’ అంటూ విశ్వక్ సేన్ కారు గురించి తరుణ్ భాస్కర్ ఫన్నీగా మెసేజ్ పోస్ట్ చేశాడు. విశ్వక్ సేన్ కి మొదటి హిట్ ఇచ్చింది తరుణ్ భాస్కరే.

Vishwak Sen Car
Vishwak Sen Car

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో హీరోగా నటించిన తర్వాతే.. విశ్వక్ సేన్ లైఫ్ టర్న్ అయ్యింది. అందుకే.. తరుణ్ భాస్కర్ పై విధంగా మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కారు ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ కారు ధర ఎంతో తెలుసా ? దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఎలాగూ ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమాలకు కూడా మార్కెట్ పెరిగింది. అందుకే విశ్వక్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

Also Read:Nivetha pethuraj: ఛాన్స్ లు రాకపోతే ఆ పనే చేస్తా.. హీరోయిన్ కన్నీళ్లు
Recommended Videos
జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి కారణం ఇదే | Jr NTR 39th Birthday Special Video | Oktelugu Entertainment
మళ్లీ ఒక్కటైన షణ్ముక్, దీప్తి సునైనా..? || Deepthi Sunaina And Shanmukh Jaswanth Relationship
డెడ్ చీప్ అయిపోయిన హీరో || Tollywood Young Hero Remuneration || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version