Vishwak Sen
Vishwak Sen : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలలో ఒకడు విశ్వక్ సేన్(Vishwak Sen). 2017 వ సంవత్సరం లో ఈయన ‘వెళ్ళిపోమాకే’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి గుర్తు లేదు. ఇక ఆ మరుసటి సంవత్సరం లో ఆయన చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, ఆల్ టైం క్లాసిక్ స్టేటస్ ని కూడా దక్కించుకుంది. బోర్ కొట్టిన సమయంలో ఇప్పటికీ కాలక్షేపం కోసం ఓటీటీ లో ఈ చిత్రాన్ని చూస్తుంటాం. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వరుసగా యూత్ కి దగ్గరయ్యే సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు.
‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్ : ది ఫస్ట్ కేస్’,’అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘ దాస్ కా ధమ్కీ’, ‘గామీ’ ఇలా ఎన్నో కమర్షియల్ సక్సెస్ లను అందుకున్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుండి గాడి తప్పాడు. ఆ చిత్రం ఫ్లాప్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన ‘మెకానిక్ రాకీ’ చిత్రం కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా ఆయన చేసిన ‘లైలా'(Laila Movie) చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మనమంతా చూసాము. ఫ్లాప్ అవ్వడమే కాదు, ఇలాంటి చెత్త సినిమాలను తియ్యకు అంటూ విశ్వక్ సేన్ చివాట్లు కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇక నుండి స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘జాతి రత్నాలు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన అనుదీప్ తో త్వరలోనే ఆయన ‘ఫంకీ’ అనే చిత్రం చేయబోతున్నాడు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి(Krithi Shetty), లేదా ఆశికా రంగనాథ్(Ashika Ranganath) నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈయనతో పాటు ఇండస్ట్రీ లోకి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి వారు 100 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లో ఉంటే, విశ్వక్ సేన్ కనీస 40 కోట్ల రూపాయిల క్లబ్ లో కూడా లేదు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ సరైన సినిమాలు తగలడం లేదు. అందుకే ఈ చిత్రంతో ఏకంగా ఆయన వంద కోట్లపై గురి పెట్టాడట. అనుదీప్ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీస్తాడు కాబట్టి, ఈ చిత్రం మినిమం గ్యారంటీ హిట్ రేంజ్ లో అయినా నిలుస్తుందని ఆశిస్తున్నారు, చూడాలిమరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.