Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నిజాయితీగా మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ఉంటూ వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియ మాత్రమే. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గేమ్ షో కాదు, పర్సనాలిటీ షో, నేను నా పర్సనాలిటీ ని చూపించుకోవడానికే వచ్చాను, నేను బయట ఎలా ఉంటానో, ఇక్కడ కూడా అలాగే ఉంటాను, గేమ్ కోసం నా స్వభావం మార్చుకోను అని చెప్పి, అదే విధంగా కొనసాగిన కంటెస్టెంట్ విష్ణు ప్రియ. మొదటి రెండు వారాలు ఈమె ఆడిన ఆట తీరుని చూసి కచ్చితంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉంటుందని అనుకున్నారు. ఓటింగ్ లో కూడా ఈమెకు ప్రారంభంలో నిఖిల్ కంటే ఎక్కువ పడిన రోజులున్నాయి. అయితే ఎప్పుడైతే ఆమె పృథ్వీ ని ప్రేమించడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి అతని కోసం మాత్రమే ఆడడం మొదలు పెట్టింది.
నాకు నీ మీద ఏ ఉద్దేశ్యం లేదు, కేవలం నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే చూస్తాను, అంతకు మించి నా నుండి ఏమి ఆశించకు అని పృథ్వీ విష్ణు కి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఆమె వినలేదు. తనకు అతని మీద ఉన్న ఫీలింగ్స్ ని ఆపుకోలేకపోయింది. నా కంటే నువ్వే ఎక్కువ అని చెప్పుకుంటూ వచ్చిన ఆమె అదే ప్రవర్తనతో పృథ్వీ ఉన్నన్ని రోజులు నడుచుకుంది. అయితే దీని వల్ల పృథ్వీ గేమ్ బాగా చెడిపోయిందని, కేవలం సానుభూతి పొందడం కోసమే తన వెంట విష్ణు ని తిప్పుకుంటున్నాడని, ఇలా పలు రకాల కామెంట్స్ బయట వినిపిస్తున్నాయని లోపలకు అతిథులు వచ్చినప్పుడు విన్న విష్ణు, నా వల్ల పృథ్వీ గేమ్ బాగా దెబ్బ తినింది అని ఫీల్ అయ్యింది. నిన్న కూడా అదే చేసింది. నిన్న నాగార్జున ఏ వారంలో మీరు తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నారో చెప్పమని అనగా విష్ణు ప్రియ నాకు ప్రతీ వారం పెట్టాలని ఉంది అని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా పృథ్వీ గురించి మాట్లాడుతూ ‘నిజానికి నా స్వభావం కాస్త అబ్బాయిలతో పులిహోర కలిపే టైపు సార్. పృథ్వీ అనే అబ్బాయి చాలా క్యూట్ గా ఉండేసరికి అతనితో కాస్త ఎక్కువ పులిహోర కలిపాను. నా మనసుకి అతను చాలా నచ్చాడు. దానిని ఆపుకోలేకపోయాను. ఫలితంగా దాని ప్రభావం ఆ అబ్బాయి గేమ్ మీద పడింది. నా వల్లనే అతను ఎలిమినేట్ అయిపోయాడు అనే ఫీలింగ్ నా మనసులో ఉంది’ అని అంటుంది. అప్పుడు నాగార్జున నువ్వు ఫేక్ గా ఏమి లేవమ్మా, నిజాయితీగా ఉన్నావు, నువ్వు చేసింది తప్పేమి కాదు అని చెప్పగా ఎందుకో నా మనసులో ఆ బాధ అలాగే ఉండిపోయింది సార్ అని అంటుంది విష్ణు. ఇంతకంటే నిజాయితీగా ఏ అమ్మాయి అయినా ఉంటుందా చెప్పండి అని నాగార్జున ఆడియన్స్ వైపు చూస్తూ విష్ణుకి చప్పట్లు కొడుతాడు.