Vishnupriya: యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లలో కొందరు మంచి పొజిషన్లో ఉన్నారు. మరి కొందరు మాత్ర ఫెయిల్యూర్ గా నిలిచిపోయారు. అయితే అవకాశాలు రాని వారు పట్టువదలని విక్రమార్కులుగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు తమ టాలెంట్ ను చూపించేందుకు కష్టపడుతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. సోషల్ మీడియాలోని కొందరు తమ సొంత ఖాతాల్లో విభిన్న వీడియోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. కొన్నాళ్ల పాటు యాంకర్ గా ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయింది. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈటీవీలో పోవే పోరా అనే ప్రోగ్రాం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫస్ట్ ప్రొగ్రాంతోనే సక్సెస్ అయింది. ఆ తరువాత మరికొన్ని షోల్లో సందడి చేసింది. అయితే ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా కవరింగ్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆమెకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ పెరిగారు. ఆ తరువాత ‘జర్రీ జర్రీ’ అనే సాంగ్ తో ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరువాత విష్ణుప్రియకు అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అమ్మడుకు ఆశించినట్లుగా జరగలేదు.
కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజాగా జబర్దస్త్ నటి రీతూ చౌదరితో విష్ణు ప్రియ రెచ్చిపోయింది. ఓ నైట్ పార్టీలో వీరిద్దరు హల్ చల్ చేశారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను తీసుకున్న విష్ణు ప్రియ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఈమె ‘కొన్ని రకాల స్నేహితులను వెతకడానికి వెలకట్టలేము’ అనే క్యాప్షన్ పెట్టింది.
ఈ వీడియోనూ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో కంటే రియల్ యాక్టింగ్ అదుర్స్ అని కొందరు మెసేజ్ పెట్టారు. అయితే విష్ణు ప్రియ ఇలా రెచ్చిపోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ అందాల ఆరబోతతో యూత్ ను ఇంప్రెస్ చేసింది. ఇదిలా ఉండగా ఈ వీడియో ఇప్పుుడు వీడియో వైరల్ అవుతోంది.