Vishnu Manchu: ఇండస్ట్రీ పెద్ద అనే పదవి కోసం కోల్డ్ వార్ నడుస్తుంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు కేంద్రంగా మొదలైన కుర్చీలాట ఇంకా కొనసాగుతుంది. మేము గొప్పంటే మేము గొప్పంటూ సినిమావాళ్లు బయట కూడా తొడలు చరుచుకుంటున్నారు. ముఖ్యంగా మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు వ్యవహారం మారింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ పవన్, నాగబాబు మద్దతు తెలిపిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ప్రకాష్ రాజ్ పై గెలిచి అధ్యక్ష పీఠం అధిరోహించిన మంచు విష్ణు పరిశ్రమపై ఆధిపత్యం మాదేనన్న భావనకు వచ్చారు.
అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు. టికెట్స్ ధరలు విషయంలో ఏపీ ప్రభుత్వానికి, పరిశ్రమకు ప్రతిష్టంభన కొనసాగుతుంది. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవిని చర్చలకు ఆహ్వానించిన సీఎం జగన్ మోహన్ బాబును దెబ్బ తీశారు. మా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ద్వారా చిరంజీవి ఫ్యామిలీ మీద పైచేయి సాధించినట్లు ఫీలైన విష్ణు, మోహన్ బాబుకు ఈ పరిణామం మింగుడు పడలేదు.
Also Read: అలీ, పోసానీలకు జగన్ న్యాయం చేస్తున్నాడా? అన్యాయమా?
మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, ఆర్ నారాయణమూర్తి, ఆలీతో కూడిన చిత్ర ప్రముఖులు సీఎం జగన్ తో భేటీలో పాల్గొన్నారు. ఈ కీలక మీటింగ్ లో మోహన్ బాబుకు ప్రాతినిథ్యం లభించలేదు. పరోక్షంగా సీఎం జగన్ చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా డిక్లేర్ చేసినట్లైంది. ఇది మోహన్ బాబు ఆశిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టింది.
నష్ట నివారణ చర్యలు చేపట్టిన మోహన్ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్వయంగా ఇంటికి ఆహ్వానించారు. అలాగే మంచు విష్ణు నిన్న సీఎం జగన్ ని కలిశారు. సీఎం జగన్ ని కలవడం మా కుటుంబానికి చిటికెలో పని. అలాగే ఆయన వద్ద మాకు చాలా వెయిట్ ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సీఎంతో భేటీ అనంతరం మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఒకింత నవ్వు తెప్పించాయి.
మంచు విష్ణు సీఎం జగన్ తమ బంధువు అని చెబుతూనే పరిశ్రమలో మా తర్వాతే ఎవరైనా అన్నట్లు మాట్లాడారు. ఇక సీఎం జగన్ నుండి మోహన్ బాబుకు ఆహ్వానం వచ్చింది, కానీ కొందరు సదరు ఇన్విటేషన్ అందకుండా చేశారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ద్వారా ఉన్న గౌరవం కూడా పోగొట్టుకున్నట్లు అవుతుంది. ఆహ్వానం ఉంటే అందకుండా చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. సీఎం జగన్ తో అంత చనువు ఉన్నప్పుడు ఆయన నేరుగా మోహన్ బాబును ఫోన్ చేసి పిలవలేదా?
ఇక దాసరి నారాయణరావు మరణం తర్వాత మంచు ఫ్యామిలీ ఆధిపత్యం తగ్గింది కదా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మంచు విష్ణు పెద్దగా నవ్వేశారు. మాకు పరిశ్రమలో ఆధిపత్యం, బలం లేకుంటే మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడు కుర్చీలో కూర్చోగలనా.. అంటూ ఎదురు ప్రశ్నించారు. మొత్తంగా మంచు విష్ణు తాజా ప్రెస్ మీట్ మీమ్స్ రాయుళ్లకు కావాల్సినంత మెటీరియల్ ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే మంచు వారి అబ్బాయిపై ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. నిన్నటి నుండి ఆయన ఇంటర్వ్యూ పై సెటైర్లు పేలుతున్నాయి.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More