OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ విశేషాలను హీరో శర్వానంద్ మీడియాతో పంచుకున్నాడు. ‘ఆడవాళ్లందరి మధ్య కూర్చుని చాలా సరదాగా చేసిన సినిమా ఇది. కామెడీ కోసమని ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథలో భాగంగానే ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశా. రాధిక, ఖుష్బూతో కలిసి నటించడం మంచి అనుభూతినిచ్చింది. రష్మిక చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 24గంటల్లోనే 28 మిలియన్ వ్యూస్ దాటిన ఈ సాంగ్ ఆల్ టైం రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 2.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఈ సాంగ్‌కు అనిరుధ్ సంగీతం అందించి తానే పాడాడు. విజయ్, పూజా డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్టే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ నెల 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో పోస్టులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ‘అద్దీ లెక్క.. డంగరనక్కర డంగరనక్కర..డడ్డామ్ డడం డంగరనక్కర’ అని ట్వీట్ చేశారు.

కాగా కరోనా థర్డ్‌వేవ్ తర్వాత రిలీజ్ కానున్న పెద్ద సినిమా ఇదే కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాబట్టి.. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: సంగీత ప్రపంచంలో డిస్కో గోల్డ్ మాన్