Vishnu Manchu: ఏపీలో టికెట్ల రేట్ల వివాదం తెర మీదకు వచ్చినప్పటి నుంచి.. అందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఎవరెవరో స్పందిస్తున్నారు తప్ప.. అసలైన వ్యక్తి మాట్లాడట్లేదనే వాదన బలంగానే వినిపించింది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు. తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన విష్ణు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇందులో చాలా అంశాలపై స్పందించారు.

టికెట్ల రేట్ల వివాదంపై, అలాగే చిరంజీవి, జగన్ భేటీ మీద కూడా మాట్లాడారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో సపోర్టు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరి వ్యక్తిగత నిర్ణయాలను బయటకు చెప్పడం వల్లే రాద్దాంతం జరుగుతోందన్నారు. పరిశ్రమలో చాలా అసోసియేషన్‌లు ఉన్నాయని, వాటన్నింటినీ కలుపుకుని పోవాలన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చెప్తే అదే ఫాలో అవుతామన్నారు.
Also Read: జేఎన్.యూ తొలి మహిళా ఉపకులపతిగా శాంతిశ్రీ నియామకం
ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోందని, ఒక వేళ తమను వెళ్లి మాట్లాడమంటే మాట్లాడుతామంటూ చెప్పారు. అంతే కానీ ఎవరి ఇష్టానికి వారు వెళ్తే అది సబబు కాదన్నారు. ఇక చిరంజీవి, జగన్ భేటీ మీద షాకింగ్ కామెంట్లు చేశారు. అది చిరంజీవి వ్యక్తిగత సమావేశం అని, దానికి అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

అయితే చిరంజీవి భేటీ మీద విష్ణు ఇలాంటి కామెంట్లు చేయడంతో అందరూ షాక్ అయిపోతున్నారు. గతంలో చిరంజీవి తాను ఇండస్ట్రీ తరఫున మాట్లాడటానికి వచ్చానని, సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాగా జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన విష్ణు మాత్రం ఇలా అనడం ఇప్పుడు షాకింగ్ గా ఉంది. చిరంజీవి మీద ఉన్న కోపాన్ని ఇలా బహిరంగంగానే చెప్పేశారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి భేటీ మీద ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఇలాంటి కామెంట్లు చేయలేదు. మరి విష్ణు మరోసారి అగ్గి రాజేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
Also Read: మహిళలకు కేంద్రం శుభవార్త.. రెండో కాన్పుకు కూడా డబ్బులు పొందే ఛాన్స్!