https://oktelugu.com/

Vishnu Cheated Big Director : Nagababu: మంచు విష్ణు కూడా ఆ దర్శకున్ని మోసం చేశాడు : నాగబాబు

Vishnu Cheated Big Director : Nagababu ‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పూర్తి రసవత్తంగా మారాయి. అధ్యక్ష్య పదవి కోసం ఒకవైపు మంచు విష్ణు, మరో వైపు ప్రకాష్ రాజ్ ఎవరి పద్దతిలో వారు ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. నిన్న విలక్షణ నటుడు మోహన్ బాబు తన కొడుకు విష్ణును గెలిపించాలని, తాను అందరికి దగ్గరగా ఉంటాడని, తాను చేసిన ఇండస్ట్రీకి చేసిన సేవల గురించి ఒక లేక రూపంలో ‘మా’ సభ్యులను కోరాడు. ఇప్పటికే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 9, 2021 / 09:10 AM IST
    Follow us on

    Vishnu Cheated Big Director : Nagababu ‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పూర్తి రసవత్తంగా మారాయి. అధ్యక్ష్య పదవి కోసం ఒకవైపు మంచు విష్ణు, మరో వైపు ప్రకాష్ రాజ్ ఎవరి పద్దతిలో వారు ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. నిన్న విలక్షణ నటుడు మోహన్ బాబు తన కొడుకు విష్ణును గెలిపించాలని, తాను అందరికి దగ్గరగా ఉంటాడని, తాను చేసిన ఇండస్ట్రీకి చేసిన సేవల గురించి ఒక లేక రూపంలో ‘మా’ సభ్యులను కోరాడు. ఇప్పటికే విష్ణు.. బాలకృష్ణ , కోట శ్రీనివాస్ రావు, కృష్ణ ఇండస్ట్రీ పెద్దలను కలిసి తమ మద్దతు కావాలని కోరారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం పెద్దల సపోర్ట్ అవసరం లేదని, తన అజెండాతోనే గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతున్నారు. తాజాగా మంచు విష్ణుపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ‘మా’సభ్యులు ఓటు వేయాలో ఒక వీడియో విడుదల చేశాడు.

     

     

    మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. విష్ణు తన తండ్రి మోహన్ బాబు నటుడు, దర్శకుడు, నిర్మాత అని చెప్పుకుంటున్నాడని, తన తండ్రికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయ్ కానీ, విష్ణుకి లేవని తెలిపాడు. నువ్వు నీ తండ్రి పేరు చెప్పుకొని తిరుగుతున్నావని, కానీ ప్రకాష్ రాజ్ అలా కాదని, వేషాల కోసం అన్ని స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి ఉన్నాడని, ఈరోజు నాలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాడు. విష్ణు ఊరికే ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదని అంటున్నాడు, కనీసం నీకు తెలుగు కూడా సరిగా పలకడం రాదనీ నాగబాబు విష్ణుకి చురకలు అంటించాడు. ప్రకాష్ రాజ్ కిందనుంచి పైకి వచ్చాడని, ఊరూరా తిరిగి నాటకాలు వేసిన అనుభవం ఉందని, నటుల కష్టాలు ఆయనకు తెలుసు అన్నారు. కళ్ళ నిండా కలలు పెట్టుకుని తిరిగాడు కాబట్టి.. ఆయనకు సినిమా ఆర్టిస్టుల కష్టాలు తెలుసన్నాడు.

     

    ప్రకాష్ రాజ్‌కు నిర్మాతలతో గొడవలు ఉన్నాయని పదే పదే అంటున్నారు, మీరు కూడా సలీమ్ సినిమా సమయంలో వైవీఎస్ చౌదరి రెమ్యునరేషన్ సమయంలో అతన్ని మోసం చేయలేదా, ఆ విషయం కోర్టు దాక వెళ్తే, కోర్టు మీకు మొట్టికాయలు వేసిందని తెలుగువాళ్ళకు తెలియదా అని నాగబాబు ప్రశ్నించారు. ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఎదురునిలబడ్డాడు, కానీ చాల మంది సామాన్యులు మీలాంటి వాళ్ళను తట్టుకోలేక వెనుతిరిగిన వాళ్ళు లేరా అని అన్నారు. ఇలాంటి గొడవలు సృష్టించే మాటలు కట్టి పెట్టాలని, ప్రకాష్ రాజ్ లోకల్ కాదని అంటున్నారు, ‘మా’ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని, విష్ణు ఇప్పటి వరకు పట్టుమని 25 సినిమాలు కూడా చేయలేదని, ప్రకాష్ రాజ్ 25 ఏళ్ళనుంచి సంవత్సరానికి 25 సినిమాల్లో కూడా నటించిన అనుభవం ఉన్న వ్యక్తి అని, తన మద్దతు ఎప్పుడు ప్రకాష్ రాజ్ కి ఉంటుందని నాగబాబు అన్నాడు.