Anand Devarakonda’s ‘HIGHWAY’ Shooting Over: ఆనంద్‌ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి,

Anand Devarakonda’s ‘HIGHWAY’ Shooting Over: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్ గా పని చేసిన కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హైవే. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్న యువ నటుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు సినిమా టీం. తాజాగా నిన్న ఈచిత్రం షూటింగ్ […]

Written By: Sekhar Katiki, Updated On : October 9, 2021 8:23 am
Follow us on

Anand Devarakonda’s ‘HIGHWAY’ Shooting Over: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్ గా పని చేసిన కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హైవే. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్న యువ నటుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు సినిమా టీం. తాజాగా నిన్న ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని సినిమా టీం వెల్లడించింది.

 

 

చిత్ర దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ అని, వినూత్న కాన్సెప్ట్‌తో, ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు, ఆస‌క్తిక‌ర మలుపులతో ఉంటుందని తెలిపాడు. సినిమా చిత్రీకరణకోసం రెండు తెలుగురాష్ట్రాలలో అందమైన లొకేషన్లతో పాటు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో కూడా షూటింగ్ జరిపామని, పూర్తి విలువలతో సినిమా రూపుదిద్దుకుందని గుహన్ తెలిపాడు. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించి విషయాలతో ముందుకు వ‌స్తామని వారు అన్నారు.

 

ఈ చిత్రాన్ని శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2 పై వెంకట్‌ తలారి నిర్మిస్తున్నాడు. అతడు, జల్సా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్ గా పని చేసిన గుహ‌న్ గారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారని, సినిమా త్వరగా పూర్తయింది, సినిమా అందరికి నచ్చుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నటీనటులు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, మాన‌స రాధాకృష్ణన్ అద్భుతంగా నటించారని, సినిమా ప్రకటించినప్పటినుండి మంచి టాక్ వచ్చిందని తెలిపాడు. మూవీ షూటింగ్ పూర్త‌య్యిందని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు.