https://oktelugu.com/

Vishal Rathnam: అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్ధమైన విశాల్ రత్నం… అక్కడ చూసేయండి!

సింగం సిరీస్ తో పాప్యులర్ అయిన దర్శకుడు హరి తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన రత్నం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో అనుకున్న సమయానికి ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 7, 2024 / 11:44 AM IST

    Vishal Rathnam Movie OTT Release Date And Platform

    Follow us on

    Vishal Rathnam: గత ఏడాది మార్క్ ఆంటోని చిత్రంతో భారీ హిట్ కొట్టాడు విశాల్. వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది ఆ చిత్రం. ఈ ఏడాది రత్నం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రత్నం తెరకెక్కింది. సింగం సిరీస్ తో పాప్యులర్ అయిన దర్శకుడు హరి తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన రత్నం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో అనుకున్న సమయానికి ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

    సమ్మర్ కానుకగా ఏప్రిల్ 26న రత్నం విడుదలైంది. విశాల్ కి జంటగా ప్రియా భవాని శంకర్ నటించింది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ మీనన్ వాసుదేవ్ కీలక రోల్స్ చేశారు. కాగా రత్నం చిత్రం డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ కొనుగోలు చేసింది. ఇక రత్నం థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో మే 24 నుండి స్ట్రీమ్ కానుందని సమాచారం.

    ఈ న్యూస్ విశాల్ అభిమానులకు కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే థియేటర్స్ లో రత్నం సినిమాను మిస్ అయిన ఆడియన్స్ ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. రత్నం మూవీ కథ విషయానికి వస్తే… ఎమ్మెల్యే పన్నీరు సెల్వం(సముద్రఖని) వద్ద రత్నం(విశాల్) నమ్మిన బంటుగా ఉంటాడు. అనుకోకుండా రత్నం జీవితంలోకి మల్లిక(ప్రియా భవాని శంకర్) అనే అమ్మాయి వస్తుంది.

    మల్లిక రాకతో రత్నం జీవితం మారిపోతుంది. మల్లికను లింగం బ్రదర్స్ అనబడే దుర్మార్గులు చంపే ప్రయత్నం చేస్తుంటారు. అసలు మల్లిక ఎవరు? ఆమెను లింగం బ్రదర్స్ ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? రత్నం గత జీవితం ఏమిటీ? తన శత్రువుల మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ. విశాల్ మాస్ హీరోగా అలరిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయి. ఓటీటీలో మిస్ కాకుండా చూసేయండి…