https://oktelugu.com/

Balayya: బాలయ్య సినిమాలో మరో యాక్షన్ హీరో ?

Balayya: బాలయ్య ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు. అందుకే, బాలయ్య మీద స్టార్ట్ కెమరా యాక్షన్ అని చెప్పడానికి రాజమౌళి కూడా తనకు భయం అని పబ్లిక్ గా చెప్పాడు. ఇక బాలయ్య ఫేస్ మీద యాక్షన్ అని ఇంక ఎవరు దైర్యంగా చెప్పగలరు ? ఒ క్క బోయపాటి శ్రీనుకు అది కుదిరింది. ఓ దశలో బోయపాటి కూడా బాలయ్య కోపానికి తిట్లు తినాల్సి వచ్చింది అనుకోండి. అయినా, ఎందుకో ఆ తర్వాత […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 06:42 PM IST
    Follow us on

    Balayya: బాలయ్య ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు. అందుకే, బాలయ్య మీద స్టార్ట్ కెమరా యాక్షన్ అని చెప్పడానికి రాజమౌళి కూడా తనకు భయం అని పబ్లిక్ గా చెప్పాడు. ఇక బాలయ్య ఫేస్ మీద యాక్షన్ అని ఇంక ఎవరు దైర్యంగా చెప్పగలరు ? ఒ క్క బోయపాటి శ్రీనుకు అది కుదిరింది. ఓ దశలో బోయపాటి కూడా బాలయ్య కోపానికి తిట్లు తినాల్సి వచ్చింది అనుకోండి. అయినా, ఎందుకో ఆ తర్వాత బాలయ్యకి బోయపాటికి బాగా సింక్ అయింది.

    Vishal Balakrishna

    దానికి తగ్గట్టు వరుస హిట్లు వస్తున్నాయి. ఇక కట్ చేస్తే.. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్య ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. బాలయ్య కూడా అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో ఉత్సాహంగా మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఆల్ రెడీ బాలయ్య కోసం ఇప్పటికే గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు.

    అయితే, ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరో కూడా నటించబోతున్నాడు. తమిళ హీరో విశాల్ కూడా ఈ చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటిస్తాడట. ఈ సినిమాను తమిళ – తెలుగు రెండు భాషల్లో తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తమిళంలో కూడా సినిమా మార్కెట్ కావాలంటే అక్కడ స్టార్ ఈ సినిమాలో నటించాలి. ఈ క్రమంలోనే విశాల్ నటించబోతున్నాడు.

    ఇక హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట.

    Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ తో కలిసిన మరో ఆర్… వైరల్ గా మారిన ఫోటో

    ఏది ఏమైనా ఇప్పుడున్న తెలుగు సినిమా హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ చాలా విషయాల్లో నిర్మాతలకు మంచి లాభదాయకం అనే చెప్పాలి. ఎందుకంటే.. బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదు. బాలయ్య నుంచి డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవు. ఏ రకంగా చూసుకున్న బాలయ్యతో సినిమా అంటే నిర్మాత‌లకు ఎప్పుడూ సంతోషమే.

    Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి… బుద్దా అరుణకి కారు బహుమతి

    Tags