Vishal : సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జీవితాంతం ఉంటే.. మరికొన్ని మధ్యలోనే చెడిపోతూ ఉంటాయి. ఈ పరిశ్రమలో నటుల మధ్య సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ మనస్పర్ధలు కారణంగా తొందర్లోనే దూరం అవుతారు. అయితే ఇలా సన్నిహితులుగా ఉన్న సమయంలో కొన్ని రూమర్లు బయటికి వస్తూ ఉంటాయి. ఇవి రూమర్లు అని అనుకున్న వీటిలో కొన్ని నిజమవుతూ ఉంటాయి. అలా ఇప్పటికే హీరో హీరోయిన్ల మధ్య ముందుగా రూమర్లుగా వచ్చి.. ఆ తర్వాత నిజమైనవి ఉన్నాయి. అలాకాకుండా అబద్ధము అయినవి ఉన్నాయి. కానీ హీరో విశాల్ పెళ్లి విషయంలో నాలుగు రూమర్లు వచ్చి.. వాటిలో ఒకటి నిజంగా మారింది. ఇంతకీ అవేంటంటే?
తెలుగు రాష్ట్రానికి చెందిన సౌత్ ఇండస్ట్రీ నటుడు విశాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటు తెలుగులోనూ.. వాడు తమిళంలోనూ నటించి అందరి చేత మెప్పించాడు. ఒకప్పుడు విశాల్ సాధారణ హీరో అనుకున్న.. ఆ తర్వాత కొందరి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అలాగే తమిళ ఇండస్ట్రీలో తనకు ప్రత్యేక స్థానం కూడా లభించింది.
అయితే విశాల్ పెళ్లి విషయంలో ఎప్పటినుంచో చాలా రకాలుగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. విశాల్ కొందరు హీరోయిన్లను ప్రేమించాడని వారినే పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు వచ్చాయి. వీటిలో ముందుగా వరలక్ష్మీ శరత్ కుమార్ తో పెళ్లి అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. వీరు ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అన్నారు. కానీ ఆ తర్వాత తాము కేవలం స్నేహితులమేనని.. పెళ్లి చేసుకోలేని స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్ కు పులిస్టాప్ ఆగలేదు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడంతో ఇది రూమర్ గానే మిగిలిపోయింది.
Also Read : రజినీకాంత్ కూతురుతో తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్..? మామూలు ట్విస్ట్ కాదుగా!
ఆ తర్వాత విశాల్, అభినయ మధ్య ప్రేమ చిగురించిందని.. వీరు త్వరలో ఒక్కడి కాబోతున్నారని పుకార్ల షికారులు అయ్యాయి. కానీ విశాల్ దీనిపై అయితే స్పందించలేదు. అయితే అభినయ మాత్రం తనకు విశాల్ ఒక స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా అభినయ హైదరాబాదులో తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్ కు ఇక్కడే పుల్ స్టాప్ పడింది.
అలాగే మరో నటి అభిరామితో కూడా విశాల్ కు అనుబంధం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ విషయంలో విశాల్ తో పాటు అభిరామి ఇలాంటి రియాక్ట్ కావకపోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇది కూడా రూమర్ గాని నిలిచిపోయింది. ప్రస్తుతం విశాల్ సాయి దన్సికతో ఆగస్టు 19న వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీంతో ఇక విషయాలపై ఎలాంటి రూమర్లు వచ్చే అవకాశం లేదని ఆయన ఫ్యాన్స్ ఉంటున్నారు.