Heroine : చిన్నతనంలోనే తమ అందంతో, అభినయంతో వెండితెర మీద మాయ చేస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలో వచ్చిన అనుకోని పరిస్థితుల కారణంగా చాలామంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. అప్పట్లో వ్యక్తిగత కారణాల వలన ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యి జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించిన వీళ్ళు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెకండ్ షురూ చేస్తున్నారు. మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే అని చెప్పొచ్చు. చిన్నప్పటినుంచి ఈమెకు నటి కావాలనే కోరిక ఉండడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 17 ఏళ్ల చిన్న వయసులోనే తన అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఏకంగా మూడు సినిమాల ఆఫర్లను అందుకుంది. కానీ ఈ హీరోయిన్ ఆ మూడు సినిమాలకు ఓకే చెప్పలేదు. 17 ఏళ్ల చిన్న వయసులోనే తోపు హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
ఆ తర్వాత 19 ఏళ్ల చిన్నవయసులోనే భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది. తన కూతురితో పాటు బయటకు వచ్చేసిన ఈ హీరోయిన్ ఒంటరిగా జీవనం సాగించింది. ఈ హీరోయిన్ కాదు ఒకప్పటి తోపు హీరోయిన్ రుక్సర్ రెహమాన్. ఈమె 1992లో దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రకేగీ దునియా సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక అదే ఏడాది రిషి కపూర్ కి జోడిగా ఇంతః ప్యార్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం అందుకుంది. 17 ఏళ్ల చిన్న వయసులోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. కానీ తన కుటుంబం ఒత్తిడితో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి పెళ్లి కూడా చేసుకుంది. ఆ సమయంలోనే రుక్సర్ రెహమాన్ కు బాజీగర్, రోజా వంటి భారీ సినిమాలలో నటించే అవకాశం వచ్చింది.
Also Read : రజినీకాంత్ కూతురుతో తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్..? మామూలు ట్విస్ట్ కాదుగా!
కానీ అప్పటికే ఆమె కుటుంబం ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమాలకు ఆమె ఓకే చెప్పలేదు. పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రుక్సర్ రెహమాన్ మాట్లాడుతూ తనకు 19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకున్నానని, తన 8 నెలల కూతురితో ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా బట్టల దుకాణాన్ని మొదలుపెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఒక దశాబ్దం తర్వాత రుక్సర్ 2005లో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన డి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.