Homeఎంటర్టైన్మెంట్Virata Parvam: క్లారిటీ ఇచ్చిన " విరాటపర్వం" త్వరలో అధికార ప్రకటన...

Virata Parvam: క్లారిటీ ఇచ్చిన ” విరాటపర్వం” త్వరలో అధికార ప్రకటన…

Virata Parvam: అరణ్య ఈ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు రానా దగ్గుబాటి.  ఈ సినిమా తర్వాత ఇంత వరకు ఏ సినిమాను విడుదల చేయలేదు ఈ ఆరడుగుల ఆజానుబాహుడు. దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇంత వరకు ఈ సినిమా విడుదల డేట్ ను ఫిక్స్ చేయలేదు మేకర్స్. తాజాగా ఈ చిత్రం గురించి మరో కొత్త సమాచారం తెలియజేశారు మూవీ యూనిట్.

virataparvam movie poster with release date may out soon

నక్సలిజం నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ చిత్రం కూడా త్వరలో ఓటీటీ లోనే విడుదల కానున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఈ తరుణంలో దర్శకుడు వేణు ఊడుగుల “విరాటపర్వం” థియేటర్ల లోనే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌తో కూడుకున్న కొత్త పోస్టర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఎట్టకేలకు ఓటీటీలో వస్తుంది అనుకున్నఈ  సినిమా థియేటర్ లో విడుదల కానుండడంతో దగ్గుబాటి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. అలానే ఈ మూవీలోని ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular