Krithi Shetty: తెలుగు ఇండస్ట్రీకి ” ఉప్పెన” సినిమాతో పరిచయం అయ్యారు కృతి శెట్టి. ఆ చిత్రం విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు ఈ అమ్మడు. అయితే ఈ మధ్య వరస ప్రాజెక్టులతో బిజీ అయిపోతుంది. తాజాగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉప్పెన సినిమా కృతి శెట్టి కి టాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ లాంటిదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ అంతంత మాత్రమే ఉన్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ భామ నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్యామ్ సింగరాయ్” లో నటిస్తుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల కానుంది. అలానే అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం” బంగార్రాజు”. ఈ సినిమా లో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ అమ్మడు
ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆ సినిమా కోసం కృతిని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించి దర్శకుడు, ఇతర వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది వాస్తవం లేదా అవాస్తవం అని తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.