Homeఎంటర్టైన్మెంట్Virata Parvam Vennela Character: అడవి కాచిన వెన్నెలే సరళ.. అతని స్ఫూర్తితో ఉద్యమ...

Virata Parvam Vennela Character: అడవి కాచిన వెన్నెలే సరళ.. అతని స్ఫూర్తితో ఉద్యమ బాట.. ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య!

Virata Parvam Vennela Character: సినిమా మనుషులపై అత్యంత ప్రభావం చూపే వేదిక. ఇందులో విభిన్న కథలతో ప్రేక్షకులను అకాట్టుకునే ప్రయత్నం చేస్తారు దర్శక నిర్మాతలు.. ఇదే క్రమంలో చారిత్రక నేపథ్యాలను, నిజజీవితాలను తెరకెక్కిండం కూడా మొదలైంది. ఎంతోమంది జీవితాలను తెరకెక్కించినా కొన్ని చిత్రాలు జనాలను తీవ్ర ప్రభావితం చేశాయి. ఇలాంటి కథల్లో ఈనెల 17న విడుదలవుతున్న విరాట్‌పర్వం కథ కూడా ఒకటి. ఎందుకంటే ఈ కథ వెనుక అనేక పార్శా్వలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి. తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి. నక్సలైట్లపేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు.. ఇన్‌ఫార్మర్‌ పేరిట నక్సలైట్లు కూడా ఎంతోమందిని హతమార్చారు.. ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. అయితే పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌ అయిన ప్రతీవాడు నక్సలైట్‌/మావోయిస్ట్‌ అవునా… నక్సలైట్లు/మావోయిస్టులు హతమార్చిన ప్రతీ వ్యక్తి ఇన్‌ఫార్మరేనా అనేది ఇక్కడ ప్రశ్న. నక్సలైట్‌ అంటే ఇన్‌ఫార్మర్‌ అయితే కౌంటర్‌ చేయాల్సిందేనా? ఇన్‌ఫార్మర్‌ ఫార్మర్‌ అయితే ఖతం చేయాల్సిందేనా? ఇలాంటి అనేక కోణాలను స్పృశించే సినిమాగా వస్తుందన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Virata Parvam Vennela Character
saipallavi, sarala

చైతన్యవంతురాలు సరళ..
ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా, ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఓ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన యువతి సరళ. కుటుంబ నేపథ్యమంతా కమ్యూనిస్టులే కావడంతో సహజంగానే ఆమలోనూ చైతన్యం ఎక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్‌ ఉద్యమం చురుకుగా సాగుతున్న క్రమంలో అనేక పోరాటాలు, పేదల తరఫున నిర్వహించే పంచాయితీలు, ఎన్‌కౌంటర్లు, మందుపాతర్లు పేల్చడం వంటి అనేక ఘటనలపై నాడు పత్రికల్లో వచ్చే కథనాలను చదువుతూ సరళ ఉద్యమం వైపు ఆకర్షితురాలైంది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో నక్సలైట్‌ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న శంకరన్న చేస్తున్న పోరాటం, పేదల తరఫు కొట్లాడుతున్న తీరు, దొరలు, భూస్వాముల పెత్తందారి తనాన్ని ఎదురిస్తున్న తీరుపై పత్రికల్లో కథనాలు చూసిన సరళ ఆయన నుంచ ప్రేరణ పొందింది. ఉత్తర తెలంగాణ అంతటా ఉద్యమాలు నడుస్తున్నా.. శంకరన్న సారథ్యంలో పీపుల్స్‌వార్‌ దళాల దుందుడుకు పోకడలు సరళలో చైతన్యం తెచ్చాయి. ఈ తరుణంలో ఎలాగైనా తాను అటవి బాట పట్టాలని నిర్ణయించుకుంది. అదీ శంకరన్న సారథ్యంలోనే అనుకుని ఖమ్మం నుంచి నిజామాబాద్‌ బయల్దేరింది.

Also Read: Sudheer- Getup Srinu- Auto Ram Prasad: సుధీర్ – గెటప్ శ్రీను – రాంప్రసాద్ కాంబినేషన్ ని మళ్ళీ చూడలేమా ?

అడవి బాటలో.. అసువులు బాసి..
పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో ఆయుధం పట్టి శంకర్న సారథ్యంలో పోరాటం చేయాలని బయల్దేరిన 17 ఏళ్ల యువతి… నల్లగొండ, వరంగల్, కరీంనగర్‌ జిల్లాను దాటుకుని నిజామాబాద్‌కు చేరుకుంది. ఆమె దాటి వచ్చిన జిల్లాల్లోనూ నాడు నక్సలైటు చురుగ్గానే ఉన్నారు. అయినా ఆమె నిజామాబాద్‌ చేరుకుంది. నాడు దళాన్ని కంటాక్ట్‌ కావడం ఈజీ కాదు. దళంతో టచ్‌లోకి వెళ్లేంతవరకూ రోజుల తరబడి సిర్నాపల్లి ఏరియాలోనే తిరిగేది. రేయింబవళ్లూ ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. తరువాత మిలిటెంట్ల సాయంతో అసలు దళాన్ని కంటాక్ట్‌ అయింది. శంకన్నను చేరుకుంది. అయితే ఆమెలోని ఆంతర్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో అప్పటి దళం విఫలమైంది. సరళను ఒక పోలీస్‌ అనుచరురాలిగానే భావించింది.

Virata Parvam Vennela Character
sai pallavi, rana

ఈమేరకు ఆమెను పది గ్రామాల ప్రజల మధ్య విచారణ కూడా చేసింది. సరళ సమాధానాలు చెప్పే క్రమంతో తడబడడం దళ నేతల అనుమానాలను మరింత పెంచింది. ఉద్యమంలో చేరే సాకుతూ తమ రహస్యాలను పోలీసులకు చేర్చే ఇన్‌ఫ్మార్‌ అని శంకర్నతోపాటు దళ నాయకులు నిర్ణయానికి వచ్చారు. ఎవరితో కలిసి ఉద్యమించాలని వచ్చిందో అతని ఆదేశాలతోనే తుపాకీ తూటాకు బలైంది. ఇన్‌ఫార్మర్ల నిర్ధారణలో నక్సలైట్లు చేసిన అనేక తప్పుల్లో సరళ జీవితం ఒక ఉదాహరణ. అయితే తమ తప్పిదాన్ని నక్సలైట్లు దాచిపెట్టుకోలేదు. కప్పిపుచ్చుకోలేదు.. తాము చేసింది తప్పేనని ఓ ప్రకటన విడుదల చేశారు. క్షమించాలని ప్రజలను కోరారు. ఇదే కథాంశం ఇప్పుడు విరాట్‌పర్వంగా తెరకెక్కింది. అయితే అందులో ప్రేమ, ఆప్యాయత, కొన్ని మార్పులు చేర్పులు, ప్రేక్షకులను రంజింపజేసే సన్నివేశాలు కూడా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. విరాటపర్వం అనే కథ ఇప్పుడు ఎందుకు ఆసక్తి క్రియేట్‌ అయ్యిందంటే దర్శకుడు నక్సలైట్లది తప్పే అని చెప్పగలిగాడా..? ఒకవేళ చెప్పలేకపోతే, కథను క్రియేటివ్‌ ఫ్రీడం పేరిట కొత్తగా చెప్పినట్టు భావించాల్సి ఉంటుంది. తన అభిప్రాయాన్ని, నిజాన్ని బలంగా చెప్పలేకపోయాడు అనుకోవాలి.

Also Read:Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ సడెన్ గా బస్సు యాత్రకు అసలు కారణం ఏంటి?
Recommended Videos
రియల్ లైఫ్ వెన్నెల మాటలకు కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి || Sai Pallavi Emotional || Virata Parvam
సాయి పల్లవి క్రేజ్ కి కారణం ఇదే .... || Sai Pallavi Craze || Oktelugu Entertainment
Sai Pallavi Next Level Entry At Virata Parvam Pre Release Event || Oktelugu Entertainment

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version