Sudheer- Getup Srinu- Auto Ram Prasad: బుల్లితెరపై జబర్దస్త్ చరిత్ర సృష్టించిన షో. బాలీవుడ్, హాలీవుడ్ కామెడీ షోల స్ఫూర్తితో తెలుగులో ప్రయోగాత్మకంగా 2013లో ప్రారంభించారు. ధన్ రాజ్, టిల్లు వేణు, రఘు, చంటి, రాఘవ వంటి కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా షో మొదలైంది. యాంకర్ గా అనసూయ, జడ్జెస్ గా రోజా,నాగబాబు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట్లో పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. మెల్లగా పుంజుకున్న జబర్దస్త్ బాగా జనాల్లోకి వెళ్ళింది. కొత్త కొత్త టాలెంటెడ్ స్క్రిప్ట్ రైటర్స్, యాక్టర్స్ షోకి పరిచయమయ్యారు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ సీనియర్స్ టీమ్స్ లో మెంబర్స్ గా ఉండేవారు. కొందరి నిష్క్రమణతో సుడిగాలి సుధీర్ కి టీం లీడర్ అయ్యే అవకాశం దక్కింది.
సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్స్ గా గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీ జాయిన్ అయ్యారు. సుడిగాలి సుధీర్ టీం లో సన్నీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. స్క్రిప్ట్ మొత్తం సుధీర్, శ్రీను, రాంప్రసాద్ నడిపించేవారు. ఈ కాంబినేషన్ వీరలెవల్లో హిట్. శ్రీను అద్భుతమైన గెటప్స్ నటనతో నవ్వులు పూయిస్తుంటే…. రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు , సుధీర్ ఇన్నోసెన్స్ ఆకట్టుకునేవి. మొత్తంగా జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్ టీం అన్నట్లు మారిపోయింది. ఈ ముగ్గురు కలిసి అనేక సంచనాలు చేశారు.
యూట్యూబ్ లో వీరి స్కిట్స్ కి మిలియన్స్ లో వ్యూస్ దక్కుతూ ఉండేవి. సుధీర్ టీం జమానాలో జబర్దస్త్ మరింత ఎత్తుకు ఎదిగింది. టాప్ రేటెడ్ షోగా అవతరించింది. ఇదంతా గత చరిత్ర. జబర్దస్త్ ఒకప్పటి శోభ కోల్పోయింది. హైపర్ ఆదితో పాటు చాలా మంది కమెడియన్స్ జబర్దస్ నుండి వెళ్లిపోయారు. ఎవరు వెళ్లినా సుడిగాలి సుధీర్ టీం ఉంటే చాలనుకున్నారు. చివరకు ఆ టీం కూడా విచ్ఛిన్నమైపోయింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ టీం లో మిగిలింది రామ్ ప్రసాద్ మాత్రమే.
సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ లో కనిపించడం లేదు. కొన్ని వారాలుగా రామ్ ప్రసాద్ ఇతర కమెడియన్స్ తో టీమ్ ని నడిపిస్తున్నాడు. అయితే మునుపటి స్థాయిలో పంచ్ లు పేలడం లేదు. అసలు స్క్రిప్ట్ లేకుండా కూడా ఫ్లోలో హాస్యం పంచే కోఆర్డినేషన్ వాళ్ళ మధ్య ఉండేది. సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో నేను ఒంటరి అయ్యానని రామ్ ప్రసాద్ బాధపడుతున్నాడు. అలాగే స్క్రిప్ట్ రాసుకోవడం నుండి, టీం తో ప్రాక్టీస్ చేయించడం నాకు కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సినిమాలతో సుధీర్, గెటప్ శ్రీను బిజీగా ఉన్నారు. వాళ్లకు జబర్దస్త్ కోసం టైం కేటాయించడం కుదరకపోవచ్చు. అదే సమయంలో జబర్దస్త్ ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ కంటే పది రెట్లు సినిమాలు ద్వారా సంపాదిస్తున్నారు. కాబట్టి మరలా వాళ్ళు జబర్దస్త్ కి రావడం కష్టమే. ఇకపై సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లతో కూడిన స్క్రిప్ట్ చూడడం గగనమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది .
Also Read:Sai Pallavi: సాయి పల్లవి కి పెద్ద ఫ్యాన్ అయిన ఆ స్టార్ హీరో ఎవరు ?
Recommended Videos