Homeఎంటర్టైన్మెంట్RRR Surpasses Hollywood Avengers: హాలీవుడ్ 'అవేంజెర్స్' ని దాటేసిన RRR

RRR Surpasses Hollywood Avengers: హాలీవుడ్ ‘అవేంజెర్స్’ ని దాటేసిన RRR

RRR surpasses Hollywood Avengers: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..థియేటర్స్ లో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో..OTT లోకి వచ్చిన తర్వాత దానికి మించి పదింతలు రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం..ఏ తెలుగు సినిమాకి దక్కని విధంగా ఈ సినిమాకి ఇతర దేశాల నుండి రోజు రోజు కి సోషల్ మీడియా లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి అని చెప్పొచ్చు..ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఉన్న సినీ ప్రియులు అయితే #RRR సినిమా ని ఒక్క వ్యసనం లాగా అలవాటు పర్చుకున్నారు..రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ని పొగుడుతూ వాళ్ళు వేస్తున్న ట్వీట్స్ చూసి అభిమానులు పొంగిపోతున్నారు..ఇటీవలే ఈ సినిమాకి మర్వెల్ స్టూడియోస్ నుండి విడుదలైన కెప్టెన్ అమెరికా చిత్ర రచయిత అద్భుతమైన రివ్యూ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు ఇతర దేశాల నుండి #RRR కి వస్తున్న రెస్పాన్స్ లో బాహుబలి మరియు KGF సిరీస్ కి పావు శాతం కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

RRR surpasses Hollywood Avengers
RRR

Also Read: KCR alcohol habit : కేసీఆర్ కు మద్యం ఇలా అలవాటైందట.! వైరల్ వీడియో

ఇప్పుడు #RRR సినిమా USA కి చెందిన ఒక్క ప్రముఖ వెబ్సైటు రోటెన్‌ టమోటాస్‌ నిర్వహించిన ఒక్క పాపులర్ సర్వే లో #RRR మూవీ అవెంజర్స్ ని సైతం దాటేసింది..2022 వ సంవత్సరం కి గాను టాప్ 100 పాపులర్ మూవీస్ లిస్ట్ లో #RRR 42 వ స్థానం ని దక్కించుకుంది..గతం లో ఈ వెబ్సైటు లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి 94 శాతం పాజిటివ్ గా క్రిటిక్ రేటింగ్స్ వస్తే..91 శాతం పాజిటివ్ గా ఆడియన్స్ నుండి రేటింగ్స్ వచ్చింది..కానీ #RRR సినిమాకి మాత్రం 91 శాతం క్రిటిక్ రేటింగ్స్ పాజిటివ్ రాగా..ఆడియన్స్ నుండి మాత్రం అనూహ్యంగా 94 శాతం పాజిటివ్ రేటింగ్స్ వచ్చాయి..ఈ రేటింగ్స్ అన్ని తెలుగు NRI స్టూడెంట్స్ నుండి వచ్చాయి అనుకుంటే పొరపాటే..ఈ రేటింగ్స్ అన్ని మన దేశానికీ ఏ మాత్రం సంబంధం లేని ఫారిన్ మూవీ లవర్స్ నుండి వచ్చాయి..ఇది నిజంగా ఒక్క అద్భుతం అనే చెప్పాలి..ఈ సినిమా విదేశీయులకు ఈ రేంజ్ లో నచ్చిందా అని అభిమానులతో పాటుగా ఆ చిత్ర బృందం కూడా ఆశ్చర్యానికి గురి అవుతుంది..ఈ సినిమా ద్వారా వచ్చిన పాపులారిటీ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తదుపరి సినిమాలకి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.

RRR surpasses Hollywood Avengers
RRR, Avengers

Also Read: Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ సడెన్ గా బస్సు యాత్రకు అసలు కారణం ఏంటి?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version