Virata Parvam OTT Release Date: రానా-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. జూన్ 17న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. సాయి పల్లవి, రానా నటనకు మాత్రం ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి మరోసారి తన టాలెంట్ చూపించారు. మొదటి నుండి చెబుతున్న విధంగా విరాటపర్వం సాయి పల్లవి ప్రధానంగా తెరకెక్కింది. ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం తపించే, తెగించే అమ్మాయి పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు.

ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా విరాటపర్వం చిత్రం తెరకెక్కింది. దళంలో చేరిన ప్రేమికుడి కోసం తాను కూడా తెగించి నక్సల్ గా మారడం నిజంగా గొప్ప విషయం. సినిమాకు కావాల్సిన ఎమోషన్, లవ్, సంఘర్షణ ఆ నిజజీవిత పాత్రల్లో ఉన్నాయి. అందుకే దర్శకుడు వేణు ఉడుగుల వారి కథను విరాటపర్వంగా తెరకెక్కించారు. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా విడుదలైన మూడు నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ క్రమంలో విరాటపర్వం ఓటీటీ డేట్ పై స్పష్టత వచ్చింది.
Also Read: Telugu Indian Idol Mega Finale: వాగ్దేవినే ఇండియన్ ఐడల్ విజేత.. ముందే చెప్పాంగా!
విరాటపర్వం ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 15న విరాటపర్వం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం కలదు. ఇంకా ముందుగానే ప్రసారమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆచార్య, సర్కారు వారి పాట వంటి చిత్రాలు మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేశాయి. సర్కారు వారి పాట చిత్రం థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ మొదలుకావడం కొసమెరుపు.

విరాటపర్వం మూవీలో ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు కీలక రోల్స్ చేశారు. డి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. విరాటపర్వం చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
Also Read: Senior Hero Naresh Third Marriage: ఆ నటితో సీనియర్ హీరో నరేష్ మూడో పెళ్లిపై మరో గాసిప్