Virat Kohli: టీం ఇండియాలో ఎంఎస్ ధోని తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీకి పేరుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ను అందించిన ఖ్యాతి అతని సొంతం. విదేశాల్లో జట్టుకు ఎక్కువ విజయాలు రుచి చూపించిన రథసారధి. దూకుడుగా ఆడటంతో పాటు జట్టును ముందుండి నడిపించడంలోనూ దూకుడుగా వ్యవహరించాడం విరాట్‌కు మాత్రమే సొంతం. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్సీగా తప్పుకున్న విరాట్.. బీసీసీఐతో చెలరేగిన వివాదం వలన తాజాగా టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ నిర్ణయం అటు క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐను కూడా షాక్‌కు గురి చేసింది.
సౌతాఫ్రికాతో 3 టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. మరుసటిరోజు అనగా శనివారం విరాట్ కోహ్లీ నుంచి ఒక్కసారిగా బాంబు పేల్చాడు. టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో క్రీడాలోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని విరాట్ స్పష్టం చేశాడు. తన ఏడేళ్ల కెప్టెన్సీలో టీం ఇండియాను దాదాపు నాలుగేళ్లపాటు వరల్డ్ నెంబర్‌వన్ స్థానంలో ఉంచిన కోహ్లీ బీసీసీఐతో రాజుకున్న వివాదం కారణంగా అర్థంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: సీఎం కేసీఆర్ మరో సంచలనం.. జీవో 317 సక్సెస్.. త్వరలోనే ఖాళీల భర్తీపై కీలక ప్రకటన..!
2021లో టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు కోహ్లీ ప్రకటన చేయడంతో పాటు వన్డేల్లో సారథిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయినా, బీసీసీఐ మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. దీంతో బోర్డుకు, అతడికి మధ్య దూరం పెరిగింది. కొన్ని రోజులు బోర్డు, విరాట్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తొలి టెస్టు ఆడిన జట్టుకు విజయం అందించాడు.
రెండో టెస్టులో కోహ్లీ వెన్నునొప్పితో దూరం అవ్వడంతో రాహుల్ కెప్టెన్సీలో రెండో టెస్టు ఓడిపోగా.. మూడో టెస్టులో కోహ్లీ అందుబాటులోకి వచ్చినా కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ సిరీస్ కోల్పోయింది. దీంతో డిసంపాయింట్ అయిన కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా కొనసాగడంలో అర్థం లేదనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అందరితో చర్చించి తను కెప్టెన్సీ నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించినట్టు సమాచారం.
Also Read: యూపీలో బెంగాల్ సీన్ రిపీట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసుగా..?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Virat kohli is leaving the captaincy what is he going to do next
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com