Viral Video : సుమారుగా 9 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మంచు మనోజ్(Manchu Manoj) ‘భైరవం'(Bhairavam Movie) చిత్రం తో నేడు మన ముందుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) లు కూడా హీరోలుగా నటించారు. విడుదలకు ముందే థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నిలబడిందంటే అందుకు కారణం ముగ్గురు హీరోల అద్భుతమైన నటన వల్లే అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ ముగ్గురి హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇది తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ అనే చిత్రానికి రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
Also Read :’గద్దర్ అవార్డ్స్’ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు చోటు లేదా..? ఇదెక్కడి న్యాయం!
తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ చాలా పవర్ ఫుల్ గా తీసారని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు మంచు విష్ణు(Manchu Vishnu) హీరో గా నటించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యిందని, అందులో VFX షాట్స్ కి సంబంధించిన ఒక గంట 45 నిమిషాల ఫుటేజీ ఉందని, ఆఫీస్ బాయ్ రఘు అదే విధంగా చరిత అనే అమ్మాయి ఈ హార్డ్ డ్రైవ్ మిస్ అవ్వడానికి కారణం అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. అయితే చరిత అనే అమ్మాయి మంచు మనోజ్ ఆఫీస్ లో అసిస్టెంట్ అని, హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోవడానికి మనోజ్ కారణం అయ్యుంటాడని మంచు విష్ణు వర్గం ఆరోపణలు చేసింది. అయితే ‘భైరవం’ చిత్రం విడుదలకు ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ చరిత ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘చరిత..చాలా థాంక్స్ అమ్మా..అన్నిట్లో నిలబడి, ఒక అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక మగాడు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ వైపు నిలబడి చూపించావ్. మీ అందరికీ జీవితాంతం నేను తోడుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. మీడియా లో జరుగుతున్న ప్రచారం గురించి మనోజ్ కి బాగా తెలుసు, అయినప్పటికీ కూడా చరిత కి ప్రత్యేకించి కృతఙ్ఞతలు తెలియజేశాడు అంటే నిజంగానే కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ వెనుక మంచు మనోజ్ హస్తం ఉందా..?, లేకపోతే కావాలని మంచు విష్ణు హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యిందని డ్రామా చేస్తే అందుకు చరిత తన నిజాయితీని నిరూపించుకున్నందుకు మనోజ్ ఇలా ఆమెని అభినందిస్తూ మాట్లాడాడా అనేది తెలియాల్సి ఉంది.
చరితకు థాంక్స్ చెప్పిన హీరో మనోజ్ https://t.co/s27EvzGBJR pic.twitter.com/gKNjEcbfiB
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2025