Chinmayi Sripada Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాహుల్ రవీంద్రన్ నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన చాలా సినిమాలు అతనిలోని నటుడిని పరిచయం చేస్తే చి.ల.సౌ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి నేషనల్ అవార్డుని సైతం అందుకున్నాడు… రేష్మిక మందనాను లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తీవ్రమైన కాంట్రవర్సీ కామెంట్లైతే చేశాడు. దాంతో ఆయన మీద ప్రేక్షకుల్లో విపరీతమైన వ్యతిరేకత ధోరణి ఏర్పడింది. ఇక ఇప్పుడు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద తన భార్య అయిన చిన్మయి స్పందిస్తూ ఒక వీడియో చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ను చాలామంది బూతులు తిడుతూన్నారు.
అందులో నన్ను కూడా కలిపి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు. దీనివల్ల నేనేదో ఇబ్బంది పడిపోయి మీరు అలా అన్నారని బాధపడుతూ కూర్చుండే రకమైతే కాదు. వాటిని లైట్ తీసుకుంటా అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి…ఇంకా చిన్మయి మాట్లాడుతూ ఇదంతా చూస్తుంటే మాకు పిల్లలు పుట్టనవసరం లేదు.
ఒకవేళ పుట్టిన వాళ్ళు పురిట్లోనే చనిపోతే బెటర్ ఎందుకంటే ఇపంటి కామెంట్స్ చూసి వాళ్లు ప్రాణాలతో ఉండలేరు అన్నట్టుగా ఆమె కొన్ని ఘాటు కామెంట్లు చేసింది. ఇక మొత్తానికైతే ఆమె మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది అని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం రాహుల్ మాట్లాడిన మాటలను తప్పు పడుతున్నారు.
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదాని భారతీయులు చాలా సాంప్రదాయంగా భావించే మంగళసూత్రాల మీద కామెంట్స్ చేయడం అనేది చిన్న విషయం కాదంటూ చిన్మయి పెట్టిన వీడియోకి కౌంటర్లు ఇస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్తోంది. రాహుల్ స్పందించి దీనిమీద ఏమైనా రెస్పాండ్ అవుతాడా? లేదా అనేది…
Chinmayi instagram story pic.twitter.com/vC48vNreWT
— Rebel Star (@Pranay___Varma) November 6, 2025
Respected @SajjanarVC Sir
Please take cognisance of this. I am sick and tired of this everyday abuse and women deserve better in Telangana. If they dont like an opinion they can ignore and leave. I am happy to file a complaint and even if this case takes 15 years let law take its… https://t.co/l4In1xLlhx— Chinmayi Sripaada (@Chinmayi) November 5, 2025