https://oktelugu.com/

ఎట్టకేలకు పెళ్లి కొడుకు కాబోతున్న ప్రదీప్? కాబోయే భార్య ఎవరంటే?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ పెళ్లికుదిరిందా? అంటే అవుననే మాట టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదీప్ యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ అతడి పెళ్లిపై మాత్రం నిత్యం సైటర్లు పేలుతూనే ఉంటాయి. అతడి షోలకు వచ్చే జడ్జీలుగానీ.. ప్రేక్షకులుగానీ.. ప్రదీప్ పెళ్లి ఎప్పుడంటూ ఆటపట్టించడం ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది. Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ ! దీంతో ప్రదీప్ కూడా […]

Written By: , Updated On : September 29, 2020 / 04:10 PM IST
pradeep

pradeep

Follow us on

Pradeep Marriage Date

బుల్లితెర యాంకర్ ప్రదీప్ పెళ్లికుదిరిందా? అంటే అవుననే మాట టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రదీప్ యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ అతడి పెళ్లిపై మాత్రం నిత్యం సైటర్లు పేలుతూనే ఉంటాయి. అతడి షోలకు వచ్చే జడ్జీలుగానీ.. ప్రేక్షకులుగానీ.. ప్రదీప్ పెళ్లి ఎప్పుడంటూ ఆటపట్టించడం ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది.

Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ !

దీంతో ప్రదీప్ కూడా విసిగిపోయినట్లు కన్పిస్తుంది. వీరి బాధను తట్టుకోలేకే బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసే పనిలో ప్రదీప్ పడ్డట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె  ప్రదీప్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

మరో మూడు నెలల్లో పెళ్లి జరుగబోతుందని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రదీప్ యాంకరింగ్ విషయాల కంటే వివాదాస్పద విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. ఇటీవల ఓ అమ్మాయి తనను ప్రదీప్ రేప్ చేశాడంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అప్పట్లో డ్రగ్స్ కేసులోనూ ప్రదీప్ పేరు తెరపైకి వచ్చాయి.

Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!

ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మినహా అతడిపై వచ్చిన ఆరోపణలు ఏవీ కూడా నిరూపితం కాలేదు. అయితే యాంకర్ పాపులర్ అయిన ప్రదీప్ పై ఇటీవల అనేక ఆరోపణలు వస్తుండటంతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. దీంతో ఇల్లు ఉన్నప్పుడు చక్కదిద్దుకోవాలనే చందంగా ప్రదీప్ సైతం తనకు చెడ్డపేరు రాకముందే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ప్రదీప్ ఇటీవల ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?..’ సినిమాతో హీరోగా కూడా మారిపోవడం విశేషం.